IND vs AUS : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఐసీసీ వన్డే టోర్నీల్లో ఒకే ఒక్కడు..
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.

Rohit Sharma creates history goes past Chris Gayle in Champions Trophy and World Cup
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ వన్డే ఈవెంట్స్(ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే ప్రపంచకప్)లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్‌లో ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్‌లో ఓ సిక్స్ బాదిన తరువాత రోహిత్ ఈ ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్‌గేల్ రికార్డును బ్రేక్ చేశాడు.
క్రిస్ గేల్ 51 ఇన్నింగ్స్‌ల్లో 64 సిక్సర్లు బాదగా రోహిత్ శర్మ కేవలం 42 ఇన్నింగ్స్‌ల్లో 65 సిక్సర్లు కొట్టాడు. వీరిద్దరి తరువాత మాక్స్‌వెల్, మిల్లర్, గంగూలీలు ఉన్నారు.
IND vs AUS : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. అటు ద్రవిడ్, ఇటు పాంటింగ్ రికార్డులు బ్రేక్..
ఐసీసీ వన్డే ఈవెంట్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు వీరే..
రోహిత్ శర్మ(భారత్) – 42 ఇన్నింగ్స్‌ల్లో 65 సిక్సర్లు
క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 51 ఇన్నింగ్స్‌ల్లో 64 సిక్సర్లు
గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) – 30 ఇన్నింగ్స్‌ల్లో 49 సిక్సర్లు
డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) – 30 ఇన్నింగ్స్‌ల్లో 45 సిక్సర్లు
సౌరవ్ గంగూలీ (భారత్) – 32 ఇన్నింగ్స్‌ల్లో 42 సిక్సర్లు
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 33 ఇన్నింగ్స్‌ల్లో 42 సిక్సర్లు
ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్) – 40 ఇన్నింగ్స్‌ల్లో 40 సిక్సర్లు
265 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ 29 బంతులు ఎదుర్కొన్నాడు. 3 ఫోర్లు, 1 సిక్స్ బాది 28 పరుగులు చేశాడు.
అంతక ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73; 96 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ కేరీ (61; 57 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. ట్రావిస్ హెడ్ (39), మార్నస్ లబుషేన్ (29)లు ఫర్వాలేదనిపించారు. జోస్ ఇంగ్లిష్ (11), గ్లెన్ మాక్స్‌వెల్ (11)లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో షమీ మూడు, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా చెరో రెండు, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా ఓ వికెట్ తీశారు.