Champions Trophy Prize Money : న‌క్క‌తోక తొక్కిన బంగ్లా, పాక్‌, ఇంగ్లాండ్‌.. ఒక్క మ్యాచ్‌లో గెల‌వ‌క‌పోయినా కోట్ల‌లో ప్రైజ్‌మ‌నీ.. ఇదేం విడ్డూరం సామీ..

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్‌లో గెల‌వ‌క‌పోయినా కూడా దాదాపుగా అఫ్గానిస్థాన్‌తో స‌మానంగా ప్రైజ్‌మ‌నీని తీసుకువెలుతోంది.

Lucky Bangladesh The prize money is almost equal to Afghanistan even if they don't win a single match

ఛాంపియ‌న్స్ ట్రోఫీ2025లో గ్రూప్ స్టేజీలో మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. గ్రూప్‌-ఏ నుంచి భార‌త్‌, న్యూజిలాండ్‌, గ్రూప్‌-బి నుంచి ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు సెమీస్ కు చేరుకున్నాయి. ఈ నాలుగు జ‌ట్ల‌లో ఏ జ‌ట్టు టోర్నీలో విజేత‌గా నిలుస్తుందో అన్న విష‌యాన్ని ప‌క్క‌న బెడితే.. టోర్నీ నుంచి నిష్ర్క‌మించిన జ‌ట్లు ఏ ఏ స్థానాల్లో టోర్నీని ముగించాయి, ఎంత ప్రైజ్‌మ‌నీతో ఆ జ‌ట్లు వెలుతున్నాయో ఓ సారి చూద్దాం..

అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు గ్రూప్ ద‌శ నుంచే ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 నుంచి నిష్ర్క‌మించాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌గా, మ‌రో మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డంతో అఫ్గాన్ మూడు పాయింట్ల‌తో నిలిచి టోర్నీని ఐదో స్థానంతో ముగించింది. అఫ్గాన్ మిన‌హా మిగిలిన మూడు జ‌ట్లు క‌నీసం ఒక్క మ్యాచ్‌లో కూడా గెలుపొంద‌లేదు. వ‌ర్షం కార‌ణంగా పాక్, బంగ్లాదేశ్‌ల మ్యాచ్ ర‌ద్దు అయ్యాయి. దీంతో ఇరు జ‌ట్లు ఒక్కొ పాయింట్ ల‌భించింది.

Pakistan Practice Session during Champions Trophy 2025 (PC:ANI)

IND vs NZ : గ్లెన్ ఫిలిప్స్ స్ట‌న్నింగ్ క్యాచ్‌.. కోహ్లీ ప్యూజులు ఔట్‌.. అనుష్క శ‌ర్మ రియాక్ష‌న్ వైర‌ల్‌..

అయిన‌ప్ప‌టికి నెట్ ర‌న్‌రేట్ పాక్ (-1.087) కంటే బంగ్లాదేశ్ (-0.443) మెరుగ్గా ఉంది. నెట్‌ర‌న్‌రేట్ క‌లిసి రావ‌డంతో బంగ్లాదేశ్ ఆరో స్థానంలో నిల‌వ‌గా పాకిస్థాన్ ఏడో స్థానంతో టోర్నీని ముగించాయి. ఇక ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఇంగ్లాండ్ జ‌ట్టు ఆఖ‌రి (ఎనిమిదో) స్థానంలో నిలిచింది.

ఏ జ‌ట్టుకు ఎంత మొత్తం ల‌భించ‌నుందంటే?

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు ప్రైజ్‌మ‌నీగా రూ.19.45 కోట్లు, ర‌న్న‌ర‌ప్ జ‌ట్టుకు రూ.9.72 కోట్లు ల‌భించ‌నుంది. ఇక సెమీస్‌లో ఓడిన ఒక్కొ జట్టుకు రూ.4.86 కోట్లు.. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన జ‌ట్ల‌కు ఒక్కొక్క‌రికి రూ.3.04 కోట్లు, ఏడు, ఎనిమిదో స్థానంలో ఉన్న జ‌ట్లు రూ.1.21 కోట్లు అంద‌నుంది. అంతేకాదండోయ్ ఎనిమిది జ‌ట్లు ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆడినందుకు అద‌నంగా 1,25000 డాల‌ర్లు అంటే భార‌త క‌రెన్సీలో సుమారు రూ.1.08 కోట్లు అందించ‌నున్న‌ట్లు ఐసీసీ తెలిపింది. ఇక గ్రూప్ స్టేజీలో ఒక్కొ మ్యాచ్ విజ‌యానికి 34,000 డాల‌ర్లు అంటే భార‌త కరెన్సీలో సుమారు రూ.29 లక్ష‌లు ల‌భించ‌నున్నాయి.

Sunil Gavaskar : సెమీస్ రేసు నుంచి ఇంగ్లాండ్ ఔట్‌.. భార‌త్ పై ఇంగ్లాండ్ మాజీల అక్క‌సు.. తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసిన గ‌వాస్క‌ర్‌..

ఈ లెక్క‌న ఐదో స్థానంలో నిలిచిన అఫ్గానిస్థాన్ రూ.3.04 కోట్ల‌తో పాటు గ్రూప్ స్టేజీలో ఆ జ‌ట్టు ఒక మ్యాచ్‌లో గెల‌వ‌డంతో అద‌నంగా మ‌రో రూ.29ల‌క్ష‌లు ల‌భించ‌నున్నాయి. అంటే రూ..3.33 కోట్లు ఆ జ‌ట్టు తీసుకువెళ్ల‌నుంది. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆ జ‌ట్టు ఆడినందుకు ఐసీసీ అద‌నంగా ఇస్తున్న రూ.1.08 కోట్ల‌ను క‌లుపుకుంటే మొత్తంగా అఫ్గానిస్థాన్ రూ.4.41 కోట్ల‌తో ఇంటికి వెలుతోంది.

అటు ఆరో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్‌కు రూ.3.04 కోట్ల‌తో పాటు ఐసీసీ హామీ మొత్తం క‌లిపి మొత్తం రూ.4.12 కోట్లు ల‌భించ‌నున్నాయి. అయితే.. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు కావ‌డం ఆ జ‌ట్టుకు చేటు చేసింది. ఒక‌వేళ మ్యాచ్ జ‌రిగి బంగ్లా గెలిచి ఉండే అఫ్గానిస్థాన్‌తో స‌మానంగా ప్రైజ్‌మ‌నీ ల‌భించేంది. ఇప్పుడు కేవ‌లం అఫ్గాన్ కంటే రూ.29ల‌క్ష‌లు త‌క్కువ మాత్ర‌మే ప‌ట్టుకుని వెలుతోంది.

Bangladesh Practice Session during Champions Trophy 2025 (PC:ANI)

Champions Trophy 2025 : నీ మాట నిజం కావాలి సామీ.. అదే జ‌రిగితే మాత్రం..

ఇక పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి రెండు స్థానాల్లో నిలిచిన ఆతిథ్య పాక్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు వ‌ట్టి చేతుల‌తో మాత్రం వెళ్ల‌డం లేదు. చెరో రూ.1.21 కోట్లతో పాటు ఐసీసీ హామీ మొత్తం క‌లుపుకుంటే రూ.2.29 కోట్లతో ఇంటికి తీసుకువెళ్ల‌నున్నాయి. మొత్తానికి ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజీలో నిష్ర్క‌మించిన‌ప్ప‌టికి జ‌ట్ల పై కోట్ల వ‌ర్షం కురిసింది.