IND vs NZ : గ్లెన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్.. కోహ్లీ ప్యూజులు ఔట్.. అనుష్క శర్మ రియాక్షన్ వైరల్..
న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.

GLENN PHILLIPS takes stunning catch and Anushka Sharma reaction viral
టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన కెరీర్ మైలు స్టోన్ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ కోహ్లీ కెరీర్‌లో 300వ వన్డే మ్యాచ్. ఈ ప్రత్యేక మ్యాచ్‌లో కోహ్లీ శతకంతో చెలరేగుతాడని ఫ్యాన్స్ ఆశించగా నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్‌లో 14 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 2 ఫోర్ల సాయంతో 11 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 2 పరుగులకే ఔట్ కావడంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. పాకిస్థాన్ పై శతకం చేసిన కోహ్లీ అదే ఊపును కివీస్‌తో మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. రెండు ఫోర్లు బాది మంచి ఊపులో కనిపించాడు. ఆరో ఓవర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (15) ఔట్ కావడంతో ఇన్నింగ్స్ నడింపించే బాధ్యత కోహ్లీ భుజాల పై పడింది.
అయితే.. ఆ తరువాతి ఓవర్‌లోనే అంటే ఏడో ఓవర్‌లోని నాలుగో బంతికి కోహ్లీ ఔట్ అయ్యాడు. మాట్ హెన్రీ వేసిన బంతికి బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా చక్కని షాట్ ను కోహ్లీ ఆడాడు. ఖచ్చితంగా ఇది ఫోర్ అవుతుందని అంతా భావించారు. అయితే.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ తన కుడి చేతి వైపు డైవ్ చేస్తూ గాల్లోనే బంతిని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో కోహ్లీతో పాటు అభిమానులు సైతం షాక్ తిన్నారు.
IND vs NZ : న్యూజిలాండ్‌తో మ్యాచ్.. రికార్డులకు ఎక్కిన రోహిత్ శర్మ..
గ్లెన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడాన్ని చూసిన కోహ్లీ ఈ విషయాన్ని కాసేపటి దాకా నమ్మలేకపోయాడు. తీవ్ర నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు. ఇక స్టన్నింగ్ క్యాచ్ అంకున్న ఫిలిప్స్ క్యాచ్ అందుకున్న తరువాత ముసిముసి నవ్వులు నవ్వాడు.
కోహ్లీ ఔటైన తరువాత అతడి భార్య అనుష్క శర్మ ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది. కాగా.. కోహ్లీ ఔట్ కావడంతో భారత్ 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Virat Kohli got shocked by Glenn Phillips’s catch.
Finally, a worthy opponent of sir ravindra jadeja 🤐.
#INDvsNZ #ViratKohli𓃵 #JohnCena #Rock #Dior #BRITs2025 #RohitSharma𓃵 pic.twitter.com/jEV3dj7OUr
— HARSH VARDHAN (@HARSHUPAL590618) March 2, 2025