IND vs NZ : అరుదైన ఘ‌న‌త సాధించిన విరాట్ కోహ్లీ.. సెహ్వాగ్‌, గంభీర్ వంటి దిగ్గ‌జాల వ‌ల్ల కూడా కాలేదు..

టీమ్ఇండియా త‌రుపున విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

IND vs NZ : అరుదైన ఘ‌న‌త సాధించిన విరాట్ కోహ్లీ.. సెహ్వాగ్‌, గంభీర్ వంటి దిగ్గ‌జాల వ‌ల్ల కూడా కాలేదు..

Virat Kohli joins Sachin and Dhoni is legendary list with 300th ODI appearance for India

Updated On : March 2, 2025 / 3:00 PM IST

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో వ‌న్డేల్లో 300 మ్యాచ్‌లు ఆడిన ప్లేయ‌ర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా కోహ్లీ ఈ ఘ‌న‌త సాధించాడు.

వ‌న్డేల్లో టీమ్ఇండియా త‌రుపున 300 వ‌న్డేలు ఆడిన ఏడో ఆట‌గాడిగా కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కాడు. స‌చిన్ టెండూల్క‌ర్‌, రాహుల్ ద్ర‌విడ్‌, సౌర‌వ్ గంగూలీ, యువ‌రాజ్ సింగ్, ఎంఎస్ ధోని, అజారుద్దీన్ లు కోహ్లీ కంటే ముందే ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఇక ఓవ‌రాల్‌గా తీసుకుంటే 23వ ఆట‌గాడిగా కోహ్లీ నిలిచాడు. కాగా.. కోహ్లీ మైలుస్టోన్ మ్యాచ్‌ను ప్ర‌త్యేకంగా వీక్షించేందుకు అత‌డి భార్య‌, నటి అనుష్క శర్మతో పాటు విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ కూడా స్టేడియానికి వ‌చ్చారు.

300 ఫ్ల‌స్ వ‌న్డేలు ఆడిన భార‌త ప్లేయ‌ర్లు వీరే..

స‌చిన్ టెండూల్క‌ర్ – 463 మ్యాచ్‌లు
ఎంఎస్ ధోని – 350 మ్యాచ్‌లు
రాహుల్ ద్ర‌విడ్ – 344 మ్యాచ్‌లు
మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ – 334 మ్యాచ్‌లు
సౌర‌వ్ గంగూలీ – 311 మ్యాచ్‌లు
యువ‌రాజ్ సింగ్ – 304 మ్యాచ్‌లు

IND vs NZ : న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. రికార్డుల‌కు ఎక్కిన రోహిత్ శ‌ర్మ‌..

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 300 ఫ్ల‌స్‌ వ‌న్డేలు ఆడిన ఆట‌గాళ్లు వీరే..

స‌చిన్ టెండూల్క‌ర్ (భార‌త్‌) – 463 మ్యాచ్‌లు
జ‌య‌వ‌ర్థ‌నే (శ్రీలంక‌) – 448 మ్యాచ్‌లు
జ‌య‌సూర్య (శ్రీలంక‌) – 445 మ్యాచ్‌లు
కుమార సంగ‌క్క‌ర (శ్రీలంక‌) – 404 మ్యాచ్‌లు
షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్‌) – 398 మ్యాచ్‌లు
ఇంజామామ్ ఉల్ హ‌క్ (పాకిస్తాన్‌) – 378 మ్యాచ్‌లు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 375 మ్యాచ్‌లు
వ‌సీం అక్ర‌మ్ (పాకిస్తాన్‌) – 356 మ్యాచ్‌లు
ఎంఎస్ ధోని (భార‌త్‌) – 350 మ్యాచ్‌లు
ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ (శ్రీలంక‌) – 350 మ్యాచ్‌లు
రాహుల్ ద్ర‌విడ్ (భార‌త్‌) – 344 మ్యాచ్‌లు
అజారుద్దీన్ (భార‌త్‌) – 334 మ్యాచ్‌లు
తిల‌క్ ర‌త్నే దిల్షాన్ (శ్రీలంక‌) – 330 మ్యాచ్‌లు
జాక్వెస్ క‌లిస్ (ద‌క్షిణాఫ్రికా) – 328 మ్యాచ్‌లు
స్టీవ్ వా (ఆస్ట్రేలియా) – 325 మ్యాచ్‌లు
చ‌మిందా వాస్ (శ్రీలంక‌) – 322 మ్యాచ్‌లు

Sunil Gavaskar : సెమీస్ రేసు నుంచి ఇంగ్లాండ్ ఔట్‌.. భార‌త్ పై ఇంగ్లాండ్ మాజీల అక్క‌సు.. తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసిన గ‌వాస్క‌ర్‌..

సౌర‌వ్ గంగూలీ (భార‌త్) -311 మ్యాచ్‌లు
డిసిల్వా (శ్రీలంక‌) – 308 మ్యాచ్‌లు
యువ‌రాజ్ సింగ్ (భార‌త్‌) – 304 మ్యాచ్‌లు
షాన్ పొలాక్ (ద‌క్షిణాఫ్రికా) – 303 మ్యాచ్‌లు
క్రిస్ గేల్ (వెస్టిండీస్‌) – 301 మ్యాచ్‌లు
విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 300 * మ్యాచ్‌లు