IND vs NZ : న్యూజిలాండ్‌తో మ్యాచ్.. రికార్డులకు ఎక్కిన రోహిత్ శర్మ..
దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.

PIC credit @ BCCI TWITTER
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. భారత తుది జట్టులో ఓ మార్పును చోటు చేసుకుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆడిన పేసర్ హర్షిత్ రాణా స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుది జట్టులోకి వచ్చాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తొడకండరాల గాయం బారిన పడిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడడని వార్తలు వచ్చాయి. అయితే.. గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ బరిలోకి దిగాడు. టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఇది 300వ వన్డే మ్యాచ్ కావడం విశేషం.
🚨 Toss 🚨 #TeamIndia have been to put into bat first against New Zealand
Updates ▶️ https://t.co/Ba4AY30p5i#TeamIndia | #NZvIND | #ChampionsTrophy pic.twitter.com/uhSvImvgEQ
— BCCI (@BCCI) March 2, 2025
భారత తుది జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, షమీ, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
న్యూజిలాండ్ తుది జట్టు..
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకెల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), కేల్ జేమీసన్, విలియమ్ ఓరూర్కీ
Champions Trophy 2025 : నీ మాట నిజం కావాలి సామీ.. అదే జరిగితే మాత్రం..
మూడో కెప్టెన్‌గా..
కాగా.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన జాబితాలో చేరాడు. వన్డేల్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన మూడో కెప్టెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మ్యాచ్‌తో కలిసి రోహిత్ శర్మ టాస్‌ను కోల్పోవడం ఇది వరుసగా 10వ సారి.
ఇక భారత జట్టు వరుసగా 13 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయింది. ఇక వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్ రికార్డు వెస్టిండీస్ మాజీ ఆటగాడు బ్రియాన్ లారా పేరిట ఉంది. లారా వరుసగా 12 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయాడు. ఆ తరువాత పీటర్ బోరెన్ 11 సార్లు టాస్ ఓడి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.