Champions Trophy 2025 Richard Illingworth warned Shubman Gill after takes Travis Head catch in IND vs AUS clash
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బౌలింగ్ చేసింది. కాగా.. ఆసీస్‌కు షమీ తొలి షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో కూపర్ కొన్నోలీ ని ఔట్ చేశాడు.
9 బంతులు ఎదుర్కొన్న కూపర్ కొన్నోలీ పరుగులేమీ చేయకుండానే వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. వాస్తవానికి మొదట అంపైర్ క్యాచ్ ఔట్ ఇవ్వలేదు. అయితే.. టీమ్ఇండియా రివ్వ్యూ తీసుకుంది. రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లుగా కనిపించడంతో థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో 4 పరుగుల వద్ద ఆసీస్ మొదటి వికెట్ ను కోల్పోయింది.
IND vs AUS : ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఈ విషయాన్ని గమనించారా.. భారత ఆటగాళ్లు అలా ఎందుకు చేశారంటే?
VARUN CHAKRAVARTHY IS A NATIONAL HERO…!!! 🇮🇳🔥 pic.twitter.com/BRe552Gfdn
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2025
అయితే.. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఫోర్లు, సిక్సర్లతో టీమ్ఇండియాను కంగారు పెట్టించాడు. దీంతో వన్డే ప్రపంచకప్ 2023లో సెంచరీతో చెలరేగిన హెడ్ మరోసారి భారత్‌కు పీడకల మిగులుస్తాడేమోనని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అయితే.. కెప్టెన్ రోహిత్ శర్మ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దించాడు. తొమ్మిదో ఓవర్‌ను వరుణ్ చక్రవర్తి వేయగా.. ఈ ఓవర్‌లోని రెండో బంతికి హెడ్ భారీ షాట్ ఆడాడు.
అయితే.. టైమింగ్ మిస్ కావడంతో బంతి ఎత్తులో గాల్లోకి లేచింది. లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ పరిగెత్తుకుంటూ వచ్చి చక్కని క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హెడ్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 39 పరుగులు చేశాడు. దీంతో ఆసీస్ 54 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
Umpire telling Shubman Gill to hang on the catch for more time and be in complete control. pic.twitter.com/rh3C3QdZka
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2025
IND vs AUS : వరుసగా టాస్‌లు ఓడిపోతున్న రోహిత్ శర్మ.. ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు..
అయితే.. హెడ్ ఔట్ అయినప్పటికి అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ వెంటనే గిల్‌ను పిలిచాడు. అతడిని హెచ్చరించాడు. బంతిని ఎక్కువ సేపు చేతుల్లో ఉంచుకోవాలని, పూర్తి నియంత్రణ వచ్చిన తరువాతనే విసిరివేయాలని సూచించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.