టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

వీవో ఐపీఎల్ 2019లో అసలైన మజా స్టార్ట్ అయిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చెపాక్ స్టేడియంలో తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.
చెన్నై జట్టులోకి కేదార్ జాదవ్ స్థానంలో మురళీ విజయ్, ముంబై జట్టులోకి మెక్లాగాన్ స్థానంలో జయంత్ యాదవ్ వచ్చారు. కేదర్ జాదవ్ భుజం గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్-2లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఆడుతుంది.