టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

  • Published By: vamsi ,Published On : May 10, 2019 / 01:43 PM IST
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

Updated On : May 10, 2019 / 1:43 PM IST

ఐపీఎల్ పోరులో కీలక ఘట్టానికి ఒక్క అడుగు ముందుకు వచ్చేశాయి జట్లు. క్వాలిఫయర్ 2లో ఢిల్లీ, చెన్నై జట్లు మధ్య రసవత్తర పోరు జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూప‌ర్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

తొలి సారి ఐపీఎల్‌ ఫైనల్లో అడుగుపెట్టాలని ఉత్సాహంగా ఉన్న ఢిల్లీ ఓ వైపు.. 3సార్లు ఛాంపియన్‌గా నిలిచిన‌ చెన్నై మరోవైపు. ఫైన‌ల్ బెర్తు కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. విశాఖ తీరంలో జరగనున్న రసవత్తర పోరులో గెలిచిన జట్టు ఫైనల్స్‌లో ముంబైతో పోరాడాల్సి ఉంది. 

ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన ఢిల్లీ జోరుగా ఉంటే.. సొంతగడ్డపై క్వాలిఫయర్-1లో ముంబై చేతిలో ఓడిన చెన్నై ఢిల్లీపై గెలవాలని పట్టుదలగా ఉంది. 

చెన్నై సూపర్ కింగ్స్: Faf du Plessis, Shane Watson, Suresh Raina, Ambati Rayudu, MS Dhoni(w/c), Dwayne Bravo, Ravindra Jadeja, Harbhajan Singh, Deepak Chahar, Shardul Thakur, Imran Tahir

ఢిల్లీ క్యాపిటల్స్: Prithvi Shaw, Shikhar Dhawan, Shreyas Iyer(c), Rishabh Pant(w), Colin Munro, Axar Patel, Sherfane Rutherford, Keemo Paul, Amit Mishra, Trent Boult, Ishant Sharma