ఐపీఎల్‌కు ముందు సూపర్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ

ఐపీఎల్‌కు ముందు సూపర్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ

Updated On : March 21, 2019 / 9:30 AM IST

ఐపీఎల్ 12సీజన్‌కు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. దక్షిణాఫ్రికా క్రికెటర్లు అయిన లుంగీ ఎంగిడీ, అన్రిచ్ నార్తజే సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎంగిడి భుజానికి గాయం కారణంగా లీగ్‌కు దూరమవనున్నాడు. 
Read Also : కోహ్లీ.. అనుష్క రొమాంటిక్ స్టీల్ యాడ్

ఎంగిడితో పాటు మరో దక్షిణాప్రికా క్రికెటర్ అయిన అన్రిచ్ నార్తజే నైట్ రైడర్స్ జట్టుకు షాక్ ఇచ్చాడు. ఇద్దరూ గాయాల కారణంగా ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఇలా నిర్ణయించుకున్నట్లు ఐపీఎల్ మేనేజ్‌మెంట్‌కు తెలిపారు. 

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మేనేజర్ మూసాజీ మాట్లాడుతూ..’చివరి వన్డేలో శ్రీలంకలోని న్యూలాండ్స్ వేదికగా జరిగిన వన్డేలో లుంగీ చాలా ఇబ్బందికి గురయ్యాడు. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేసి కేవలం కండరం నొప్పి మాత్రమే అని చెప్పడంతో కాస్త ఊపరి పీల్చుకున్నాం. వైద్యులు అతణ్ని ఇంకొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోమన్నారు. వరల్డ్ కప్ నాటికి అందుబాటులోకి వస్తాడు’ అనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ముగించాడు. 
Read Also : ఐపీఎల్‌కు ముందు సూపర్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ