China Masters : చైనా మాస్టర్స్‌.. అద‌ర‌గొడుతున్న ల‌క్ష్య‌సేన్‌.. ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటి ముఖం ప‌ట్టిన పీవీ సింధు..

భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ ల‌క్ష్య‌సేన్ చైనా మాస్ట‌ర్స్ ప్ర‌పంచ టూర్ సూపర్‌ 750 టోర్నీలో అద‌ర‌గొడుతున్నారు.

China Masters Lakshya Sen reaches quarterfinals PV Sindhu crashes out

భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ ల‌క్ష్య‌సేన్ చైనా మాస్ట‌ర్స్ ప్ర‌పంచ టూర్ సూపర్‌ 750 టోర్నీలో అద‌ర‌గొడుతున్నారు. వ‌రుస విజ‌యాల‌తో క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన రాస్మ‌న్ జెమ్‌కే పై విజ‌యం సాధించాడు. 46 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 21-6, 21-18 తేడాతో గెలుపొంది క్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టాడు.

అటు మ‌హిళ‌ల సింగిల్స్ లో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు నిరాశ ప‌రిచింది. ప్రిక్వార్ట‌ర్స్‌లోనే ఇంటి ముఖం ప‌ట్టింది. సింగ‌పూర్‌కు చెందిన యో జియా మిన్ చేతిలో 16-21, 21-17 21-23 తేడాతో ఓట‌మి పాలైంది. గంట తొమ్మిది నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది.

AUS vs IND : ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. పెర్త్‌లో భార‌త రికార్డు ఇదే..

పురుషుల డ‌బుల్స్ విష‌యానికి వ‌స్తే.. డిఫెండింగ్ ఛాంపియ‌న్స్ సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు చేరుకుంది. డెన్మార్క్ కు చెందిన రాస్మస్ క్జెర్, ఫ్రెడరిక్ సోగార్డ్ పై 21-19,21-15 తేడాతో గెలుపొందింది.

అటు మ‌హిళ‌ల డ‌బుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌, ట్రీసా జాలీ జోడీ ప్రిక్వార్టర్స్‌లో ఓడిపోయింది. చైనాకు చెందిన లియు షెంగ్ షు, టాన్ నింగ్ చేతిలో ఓట‌మిపాలైంది.

AUS vs IND : భార‌త్‌, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌.. ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా?