సంజూ శాంసన్ ట్వీట్‌లో ఏముంది.. ఎందుకంత వైరల్

సంజూ శాంసన్ ట్వీట్‌లో ఏముంది.. ఎందుకంత వైరల్

Updated On : January 17, 2020 / 9:18 AM IST

టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ ఫ్రస్టేషన్ గురి కావడంలో తప్పు లేదు. కేరళ యువ ప్లేయర్ ను పలు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం కావడం. వరల్డ్ కప్ టోర్నీలో ధోనీ ఎంటర్ అవుతున్నాడని సైడ్ చేయడం, మిగిలిన షార్ట్ ఫార్మాట్లలోనూ అతనికి బదులుగా ఎన్నిసార్లు విఫలమవుతోన్నా రిషబ్ పంత్‌నే వికెట్ కీపర్‌గా తీసుకోవడం పలు కారణాలు అతనిని ఫ్రస్టేట్ చేసి ఉండొచ్చు కానీ, అతను ట్వీట్ లో ఏం చెప్పదలచుకున్నాడు. 

అసలు ఆ ట్వీట్ లో అర్థమేంటి. తెలియకనే దానికి 11వేల లైక్‌లు, 1.5రీట్వీట్ లు వచ్చేశాయి. ఆ ట్వీట్ లో ఏముందో తెలుసా.. కామా. అవును. వాక్యం పూర్తి చేయకుండా మధ్యలో ఉంచే కామా.. అదొక్కటి పెట్టి పోస్టు చేశాడు. కొద్ది నెలల క్రితం వరల్డ్ కప్ సెలక్షన్‌లో అంబటి రాయుడుకు స్థానం కల్పించకపోవడంపై మ్యాచ్ చూడటానికి 3డీ గ్లాసులు కొనుక్కున్నానని ట్వీట్ చేసి వ్యంగ్యంగా టీమిండియా మేనేజ్‌మెంట్‌పై చురకలు వేశాడు. 

ఇలానే సంజూ శాంసన్ కూడా సెటైర్ వేశాడా.. లేదా.. ఇటీవల న్యూజిలాండ్‌తో 5టీ20ల సిరీస్ లో చోటు దక్కించుకోకపోవడంపై విసుగు చెంది ఇలా పెట్టాడా అని అనుమానంతోనే ట్వీట్ కు రెస్పాండ్ అవుతున్నారు. 

కొద్ది రోజుల క్రితం హర్భజన్ సింగ్ సెలక్టర్ల తీరుపై మండిపడుతూ సంజూ శాంసన్ ను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించాడు. లోక్‌సభ ఎంపీ శశిథరూర్ వెస్టిండీస్ తో టీ20లు, వన్డేలకు శాంసన్ ను పక్కకుపెట్టేయడంపై ప్రశ్నించినప్పటి నుంచి సెలక్టర్లపై గురి పెరిగింది. ఈ ఘటనపై బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ స్పందించాలంటూ భజ్జీ ట్వీట్ ద్వారా అడిగాడు. 

సంజూ శాంసన్ భారత్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్. వెస్టిండీస్ సిరీస్ నుంచి పక్కకుబెడుతూనే వస్తున్నారు. శ్రీలంకతో సొంతగడ్డపై మ్యాచ్ లో ఒక్కసారి చోటు దక్కించుకున్నాడు. అది కూడా ఐదేళ్ల తర్వాత అతనికి దక్కిన సదవకాశమది.