ఇంగ్లాండ్ టూర్‌లో భాగంగా టీమిండియా ఆతిథ్య జట్టుతో నాలుగో టెస్టు మ్యాచ్ ఆడుతోంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో మొదటి రోజు టీమిండియా బ్యాటింగ్ కొనసాగిస్తోంది.
మొదటి రోజు టీ బ్రేక్ సమయానికి టీమిండియా 52 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, శుభమన్ గిల్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. సాయి సుదర్శన్ 26, రిషబ్ పంత్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Also Read: ఆమె అసంతృప్తి బావబామ్మర్దులను దగ్గర చేసిందా? క్యాడర్‌లో జోష్ నింపేలా..
ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 13 ఓవర్లు వేసి 36 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. జోఫ్రా ఆర్చర్ 12 ఓవర్లు వేసి 23 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. బ్రైడన్ కార్స్ 11 ఓవర్లు వేసి 44 పరుగులిచ్చి వికెట్లు ఏమీ తీయలేదు. బెన్ స్టోక్స్ 9 ఓవర్లు వేసి 24 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక లియామ్ డాసన్ 7 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. భారత్ నాలుగో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనుకుంటోంది. ఈ మ్యాచులో ఓడిపోతే భారత్ సిరీస్‌ను కోల్పోతుంది.