ఆమె అసంతృప్తి బావబామ్మర్దులను దగ్గర చేసిందా? క్యాడర్‌లో జోష్‌ నింపేలా..

ఇందులో భాగంగానే కేటీఆర్ తరుచూ హరీశ్‌ రావుతో స్వయంగా సమావేశం అవుతున్నారు. అటు కేసీఆర్‌ కూడా కేటీఆర్‌, హరీశ్‌లతో తరుచుగా భేటీ అవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు.

ఆమె అసంతృప్తి బావబామ్మర్దులను దగ్గర చేసిందా? క్యాడర్‌లో జోష్‌ నింపేలా..

MLC Kavitha

Updated On : July 23, 2025 / 8:11 PM IST

మ్యాటర్ ఏదైనా..అది పార్టీ యాక్టివిటీ అయినా..ప్రజాసమస్యలపై గళమెత్తాలనుకున్నా..ఆ ఇద్దరిది ఒకే ఎజెండా. టార్గెట్‌ రేవంత్ గా విమర్శల బాణాలకు ఎక్కు పెడుతున్నారు బావబామ్మర్దులు. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు తరుచూ కలుసుకుంటున్నారు. ప్రతీ విషయంపై డిస్కషన్ చేసుకుని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై అటాకింగ్‌కు వ్యూహరచన చేస్తూ ముందుకు పోతున్నారు.

అయితే వాళ్లిద్దరిని కలిపింది మాత్రం కవిత అని అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. అవును..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రాశ్‌లు కొన్నాళ్లుగా చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఎమ్మెల్సీ కవిత ఇష్యు తెరమీదకు వచ్చినప్పటి నుంచి ఆ ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది.

గతంలో కేటీఆర్, హరీశ్‌ మధ్య విభేదాలు ఉన్నాయని..సీఎం రేసులో ఇప్పటి నుంచే ఎవరి ఎత్తులు వాళ్లు వేస్తున్నారని ఎన్నో గాసిప్స్ వినిపించేవి. కానీ ఎప్పుడైతే కవిత లెటర్‌ లీక్ అయిందో..అప్పటి నుంచి ఈ ఇద్దరు బంధం మరింత బలపడిందట. కవిత లేఖ ఇష్యూ తర్వాత హరీశ్‌రావు ఇంటికి స్వయంగా వెళ్లిన కేటీఆర్‌… రెండుసార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఈ ఇద్దరు గులాబీ బాస్‌ కేసీఆర్‌తో కూడా పలుసార్లు భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు.

Also Read: నాగబాబు మంత్రి పదవికి బ్రేకులు.. పవన్ ప్లానేంటి?

పార్టీ యాక్టివిటీ అయినా..ప్రజాసమస్యలపై పోరు అయినా ప్రతి అంశాన్ని ఇద్దరు కలిసి చర్చించుకుంటున్నారు. ఇంతకు ముందు ఎవరి కార్యక్రమాల్లో వారు బిజీగా ఉండే నేతలు..ఇప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని గులాబీ నేతలే గుర్తు చేస్తున్నారు. గతంలో అత్యవసరమైతే తప్ప..కేసీఆర్ నిర్వహించే సమావేశాల్లోనూ ఈ ఇద్దరు ఒకే వేదిక మీద పెద్దగా కనిపించేవారు కాదు.. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాయినింగ్స్ అయినా..ప్రభుత్వ విధానాలపై స్పందించాలన్నా ఇష్యూ బేస్డ్‌గా ఇద్దరు కలిసి చర్చించుకుని నిర్ణయం తీసుకుంటున్నారట.

కాంగ్రెస్, బీజేపీకి అస్త్రంగా కవిత ఇష్యూ
అయితే కేటీఆర్, హరీశ్‌ బంధం బలపడడానికి ఓ రకంగా ఎమ్మెల్సీ కవితనే కారణమని అంటున్నాయి తెలంగాణ భవన్ వర్గాలు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ లీక్ తర్వాత..ఫ్యామిలీతో, పార్టీతో ఆమెకు గ్యాప్ వచ్చింది. కుటుంబంతో పాటు పార్టీ కూడా ఆమెను దూరం పెట్టింది. కేటీఆర్ టార్గెట్‌గా కవిత చేసిన వ్యాఖ్యలు, ఆమె తీరు పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో పాటు..కవిత ఇష్యూ కాంగ్రెస్, బీజేపీకి అస్త్రంగా మారింది.

రాజకీయ ప్రత్యర్థులు ప్రతి అంశానికి కవితతో ముడిపెట్టి బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అపోజిషన్‌లో ఉన్న సమయంలో..ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కవిత ఇష్యూ కేసీఆర్ ఫ్యామిలీకి, పార్టీకి హెడెక్‌గా మారింది. దాంతో కవిత ఇష్యూతో అలర్ట్ అయిన కేటీఆర్, హరీశ్..కుటుంబంతో పాటు పార్టీలో ఏ చిన్న గ్యాప్ లేకుండా జాగ్రత్తపడాలని చూసుకుంటున్నారట. ఈ క్రమంలోనే పార్టీకి సంబంధించిన ప్రతి అంశాన్ని ఇద్దరు కలిసి చర్చించుకుంటున్నారట.

ఇందులో భాగంగానే కేటీఆర్ తరుచూ హరీశ్‌ రావుతో స్వయంగా సమావేశం అవుతున్నారు. అటు కేసీఆర్‌ కూడా కేటీఆర్‌, హరీశ్‌లతో తరుచుగా భేటీ అవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలా కేటీఆర్, హరీశ్ కలిసి మెలిసి వ్యూహరచన చేస్తుండటంతో పార్టీ క్యాడర్, లీడర్లు కూడా ఫుల్‌ ఖుషీ అవుతున్నారట. ఏదైమైనా కవిత ఇష్యూ కొంత పార్టీకి ఇబ్బందిగా మారినప్పటికీ…కేటీఆర్‌, హరీష్‌ లు ఏకతాటిపై నడవడం మాత్రం పార్టీలో కొత్త జోష్‌ నింపుతోంది.