Nagababu: నాగబాబు మంత్రి పదవికి బ్రేకులు.. పవన్ ప్లానేంటి?
నాగబాబుకు పూర్తిస్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించి.. నియోజకవర్గ పర్యటనలు, పార్టీ బలోపేతం, క్యాడర్ స్రెంథెన్‌పై ఫోకస్ పెడుతారని అంటున్నారు.

మెగా బ్రదర్ నాగబాబు..మంత్రి అవుతారా? లేక రాజ్యసభ సభ్యుడవుతారా? కేంద్ర మంత్రిగా ప్రమోషన్ దక్కుతుందా? ఇవన్నీ ఆయన పొలిటికల్ ఫ్యూచర్‌పై కొనసాగుతోన్న ఊహాగానాలు. నాగబాబుకు మంత్రి పదవి విషయంలో ఇప్పటివరకు కామాలే తప్ప ఫుల్ స్టాప్ లేని చర్చే జరుగుతోంది. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామన్నారు. సీఎం చంద్రబాబు అనౌన్స్ కూడా చేశారు. పవన్ నాగబాబును ఎమ్మెల్సీగా మండలికి పంపారు. ఆల్రెడీ క్యాబినెట్‌లో ఓ పోస్ట్ ఖాళీగా ఉంది.
ఇక నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడానికి వచ్చిన ఇబ్బందేంటని చర్చ జరిగింది. అయిదే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడానికి చంద్రబాబుకు ప్రాబ్లమేం లేదట. కాకపోతే నాగబాబును రాష్ట్రమంత్రి వర్గంలోకి తీసుకోవాలా వద్దా అనేది పవన్ కల్యాణే డిసైడ్ చేయాల్సి ఉందట. నాగబాబుకు మంత్రి పదవిపై తానే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పవనే క్లారిటీ ఇవ్వడంతో ఇన్నాళ్లు జరిగిన చర్చకు కొంత క్లారిటీ వచ్చినట్లు అయింది.
Also Read: మీకు కొత్త రేషన్ కార్డులు వచ్చినప్పటికీ ఈ 2 పథకాలకు దరఖాస్తులు చేసుకోలేకపోతున్నారా?
నాగబాబుకు మంత్రి పదవిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పవన్ అంటున్నారంటే..ఆయన మదిలో వేరే థాట్స్ ఏమైనా ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది. ఇక జనసేనకు కేంద్రంలో ఒక మంత్రి పదవి కన్ ఫర్మ్ అని చెబుతున్నారు. ఆ మంత్రి పదవి నాగబాబుకు ఇప్పించుకోవాలనేది పవన్ ఆలోచన అంటున్నారు. ఏపీలో ఒక మంత్రి పదవిని కోరి దానిని బీసీ నేతకు ఇస్తే క్యాస్ట్ ఈక్వేషన్స్ సెట్ అవుతాయని ప్లాన్ చేస్తున్నారట. అందుకే నాగబాబు విషయంలో పవన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.
అయితే ఏపీ కోటాలో నాగబాబు రాజ్యసభ సభ్యుడు కావాలంటే 2026 వరకు ఆగాల్సి ఉంటుంది. లేకపోతే బీజేపీ కోటాలో వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లి..ఏపీ కోటా ఖాళీ అయినప్పుడు జనసేన సీటును బీజేపీకి ఇవ్వొచ్చు. అయితే కేంద్రమంత్రి వర్గ విస్తరణ ఈ మధ్యే జరిగే అవకాశం ఉంటే నాగబాబును తమిళనాడు నుంచి రాజ్యసభకు పంపి..సెంట్రల్ మినిస్టర్ చేస్తారని అంటున్నారు. లేకపోతే 2026లో ఏపీ కోటా రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యే వరకు నాగబాబు ఎమ్మెల్సీగా కొనసాగుతారని.. ఆ తర్వాత రాజ్యసభకు ఎంపికయ్యాక కేంద్రమంత్రి వర్గంలోకి వెళ్తారని అంటున్నారు.
ఇద్దరు బ్రదర్స్ ఒకే క్యాబినెట్‌లో ఉంటే ఎలా?
అయితే నాగబాబును రాష్ట్రమంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకున్నప్పటికి పవన్ పలు రకాలుగా ఆలోచించారట. ఇద్దరు బ్రదర్స్ ఒకే క్యాబినెట్‌లో ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారట. అంతేకాదు నాగబాబు కేంద్రంలో ఉంటే జనసేనకు పొలిటికల్‌గా బాగా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారట. మోదీతో ఉన్న రిలేషన్స్ మరింత బలపడుతాయని అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో జనసేన పాత్ర కూడా రానున్న రోజుల్లో కీలకంగా మారుతుందని..అందుకే నాగబాబు ఢిల్లీలో ఉండాలనేది పవన్ ఆలోచనగా చెబుతున్నారు.
ఒకవేళ నాగబాబును పార్టీ సేవల కోసమే ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రం రాజ్యసభకు కూడా పంపకపోవచ్చంటున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్..అడ్మినిస్ట్రేషన్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. తన శాఖలపై పట్టు పెంచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేసరికి ఇంకా క్రియాశీలకంగా పనిచేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇటు ప్రభుత్వాన్ని, అటు పార్టీ యాక్టివిటీని నడిపించడానికి ఆయనకు టైమ్ సరిపోవడం లేదట.
అందుకే నాగబాబుకు పూర్తిస్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించి.. నియోజకవర్గ పర్యటనలు, పార్టీ బలోపేతం, క్యాడర్ స్రెంథెన్‌పై ఫోకస్ పెడుతారని అంటున్నారు. సో నాగబాబుకు మంత్రి పదవి విషయంలో పవన్ మదిలో ఏముందో క్లారిటీ లేకపోయినా..రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబు ఎంట్రీని ఆపింది అయితే పవన్. ఇది ఆయన మాటల్లోనే స్పష్టం అవుతుంది. అయితే కేంద్రమంత్రిని చేస్తారా లేక పార్టీ బాధ్యతలు ఇస్తారా అన్నది మాత్రం రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.