క్రికెటర్ మనీశ్ పాండేకు దక్షిణాది హీరోయిన్‌తో పెళ్లి

టీమిండియా క్రికెటర్ మనీశ్ పాండే కొత్త జీవితం మొదలుపెట్టనున్నాడు. అందిన సమాచారం ప్రకారం.. దక్షిణాదికి హీరోయిన్ అయిన ఆశ్రితా శెట్టితో డిసెంబరులో పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య సాగుతున్న ప్రేమాయణం మీడియా కంటపడకుండా జాగ్రత్త పడినా పెళ్లి సమయానికి బట్టబయలైంది.
దక్షిణాదిలో అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వస్తున్న ఆశ్రితా ఇంద్రజిత్, ఒరు కణ్నియుమ్ మూను కలవానికలం, ఉదయం ఎన్‌హెచ్4 కనిపించి మెప్పించింది. ఐదేళ్లుగా సినీ పరిశ్రమలో ఉంటూ ఫేమ్ సంపాదించుకుంది. ఈ వివాహ వేడుకకు కొందరు భారత క్రికెటర్లు కూడా రానున్నట్లు సమాచారం.
వెస్టిండీస్ సిరీస్ ముగిసిన అనంతరం వెస్టిండీస్ పర్యటన ముగించుకుని మనీశ్ పాండే భారత్‌కు తిరిగొచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టుకు ఆడుతున్నాడు. మనీశ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 23వన్డేలు, 31టీ20లు, 89ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఉన్నాయి.