IPL 2024 -CSK vs GT : చెలరేగిన శివమ్ దూబే, రవీంద్ర.. గుజరాత్ చిత్తు.. వరుసగా రెండోసారి చెన్నై విజయం

IPL 2024 -CSK vs GT : గుజరాత్‌ టైటాన్స్ జట్టును చెన్నై సూపర్ కింగ్స్ 63 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.

IPL 2024 -CSK vs GT : ఐదుసార్లు ఐపీఎల్ లీగ్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-17 సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఇక్కడ చెపాక్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 63 పరుగుల తేడాతో గుజరాత్‌ను చిత్తు చేసింది.

చెన్నై సొంత మైదానంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. చెన్నై నిర్దేశించిన 207 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రత్యర్థి జట్టు గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 మాత్రమే చేతులేత్తేసింది. చెన్నై బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోతూ గుజరాత్ ఘోర ఓటమిని చవిచూసింది.

Read Also : IPL 2024 : స్టేడియంలో కొట్టుకుంది రోహిత్, హార్ధిక్ ఫ్యాన్సేనా..! అసలు విషయం ఏమిటంటే? వీడియో వైరల్

టాప్ స్కోరరుగా సాయి సుదర్శన్ :
గుజరాత్ ఆటగాళ్లలో సాయి సుదర్శన్ (37) టాప్ స్కోరరుగా నిలవగా.. వృద్ధిమాన్ సాహా (21), డేవిడ్ మిల్లర్ (21), అజ్మతుల్లా ఒమర్జాయ్ (11), ఉమేశ్ యాదవ్ (10) పరుగులు చేశారు. ఇక శుభ్ మన్ గిల్ (8), రాహుల్ తెవాటియా (6), స్పెన్సర్ జాన్సన్ (5), రషీద్ ఖాన్ (1) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, ముస్తాఫిజర్ రెహమాన్, తుషార్ దేశ్ పాండే తలో రెండు వికెట్లు పడగొట్టగా, డారిల్ మిచెల్, మతీష పతిరన తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

చెలరేగిన శివమ్ దూబే, రవీంద్ర :
అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేయగా.. శివమ్ దూబే (23 బంతుల్లో 51) హాఫ్ సెంచరీ చేయగా రుతురాజ్ గైక్వాడ్ (36 బంతుల్లో 46), రచిన్ రవీంద్ర (20 బంతుల్లో 46) వేగంగా స్కోర్లు చేసి రాణించారు. మిగతా ఆటగాళ్లలో డారిల్ మిచెల్ (24 నాటౌట్), సమీర్ రిజ్వీ (14), అజింక్య రహానే (12), రవీంద్ర జడేజా (7) తమ వంతు స్కోరుతో సహకరించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా, సాయి కిషోర్, జాన్సన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు. హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శిమమ్ దూబేకు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.

Read Also : IPL 2024 : ఐపీఎల్ నిర్వాహుకులపై హీరోయిన్ సీరియస్.. హార్దిక్ పాండ్య బౌలింగ్ సమయంలో..

ట్రెండింగ్ వార్తలు