Rahul Dravid : కొడితే సిక్స్.. ‘సింగిల్స్‌’ పోయే రోజులు దగ్గరలోనే.. ద్రవిడ్‌ జ్యోసం

క్రికెట్‌లో సింగిల్స్‌ను తిరస్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. కొడితే సిక్సే కొట్టాలని బ్యాట్స్‌మెన్లు ఫిక్స్‌ అయ్యే రోజులు రాబోతున్నాయని చెప్పాడు.

Rahul Dravid : కొడితే సిక్స్.. ‘సింగిల్స్‌’ పోయే రోజులు దగ్గరలోనే.. ద్రవిడ్‌ జ్యోసం

Rahul Dravid (1)

Updated On : April 9, 2021 / 8:40 PM IST

Rahul Dravid : క్రికెట్‌లో సింగిల్స్‌ను తిరస్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. కొడితే సిక్సే కొట్టాలని బ్యాట్స్‌మెన్లు ఫిక్స్‌ అయ్యే రోజులు రాబోతున్నాయని చెప్పాడు. సింగిల్స్‌కు కాలం చెల్లే రోజులు దగ్గర పడ్డాయన్నాడు. బ్యాట్‌కు బంతికి మధ్య జరిగే గణంకాలు నడిచే రోజులు వస్తాయని జోస్యం చెప్పాడు.

ఆటగాళ్ల ఎంపిక, వ్యూహరచనలను గణాంకాలు ఎంతగానో ప్రభావితం చేస్తాయని అన్నాడు. బేస్‌బాల్‌ తరహాలో క్రికెట్‌లో సైతం గణాంకాలే కీలమన్నాడు. టీ20 మ్యాచ్‌ల్లో ప్రతి బంతికీ ప్రాముఖ్యత ఉంటుందని ద్రవిడ్ తెలిపాడు.