DCvsMI: ముంబైతో మ్యాచ్‍‌కు ముందు సచిన్‌ను కలిసిన పృథ్వీ షా

DCvsMI: ముంబైతో మ్యాచ్‍‌కు ముందు సచిన్‌ను కలిసిన పృథ్వీ షా

Updated On : April 18, 2019 / 12:40 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ కు ముందు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కలిశాడు. ఈ ఆనందంలో ట్విట్టర్ వేదికగా సచిన్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నాడు. ఏప్రిల్ 18 గురువారం ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ఆడనుంది. 
Also Read : ధోనీ లేని సూపర్ కింగ్స్.. ఆర్సీబీ లాంటిది

షా ముంబై వెళ్లాడా.. సచిన్ ఢిల్లీ వచ్చాడా అనేది స్పష్టత లేదు. కానీ, ముంబైతో మ్యాచ్‌కు ముందు సచిన్ దగ్గరు మెలకువలు తెలుసుకుని వెళ్లాడు పృథ్వీ షా. ఈ సందర్భంగా చేసిన ట్వీట్‌లో ‘థ్యాంక్యూ సచిన్ సర్ ఫర్ ద లవ్లీ డిన్నర్. మిమ్మల్ని ఎప్పుడు కలిసినా సంతోషంగా ఉంటుంది సర్’ అని పోస్టు చేశాడు. 

ఆ ట్వీట్‌పై ఐసీసీ స్పందించి ఆ ఫొటోను షేర్ చేస్తూ.. ‘అవును. నువ్వు ఆ హద్దు (సచిన్‌తో కలిసి డిన్నర్ చేసే) దాటాల్సి ఉంది.’ అంటూ ట్వీట్ చేసింది. ఠా 2019 ఐపీఎల్ సీజన్లో 8 గేమ్‌లలోనూ ఆడాడు. 187పరుగులతో 152.03స్ట్రైక్ రేట్‌తో కొనసాగుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 99 పరుగులు చేశాడు.