England And Pakistan : 22 వేల ముందు ప్రపోజ్, ఓహ్..ఆమె ఎస్ చెప్పేసింది

ఇంగ్లండ్ - పాక్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తిలకించడానికి భారీగానే ప్రేక్షకులు వచ్చారు. మ్యాచ్ 9 ఓవర్ జరుగుతోంది. ఈ సమయంలో పాక్ ఆటగాళ్లు రిజ్వాన్, ఫఖార్ బ్యాటింగ్ చేస్తున్నారు. అనూహ్యంగా అందరి దృష్టి ఓ యువకుడు, ఓ యువతిపై నెలకొంది.

England And Pakistan : 22 వేల ముందు ప్రపోజ్, ఓహ్..ఆమె ఎస్ చెప్పేసింది

Love

Updated On : July 21, 2021 / 7:16 PM IST

Congrats Phil and Jill! : ప్రియుళ్లు..ప్రేయసిలకు వినూత్నంగా ప్రపోజ్ చేస్తుంటారు. బహరింగంగా పెళ్లి చేసుకుంటావా ? అంటూ ఉంగరం, పుష్పగుచ్చం ఇస్తుంటారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో…దాదాపు 22 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో ప్రియుడు..తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు…అక్కడున్న భారీ స్క్రీన్ పై దర్శనవిచ్చాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read More : Use and Use Stadium: సాకర్ ప్రపంచకప్‌ కోసం..స్పెషల్ స్టేడియం…విప్పేసి పట్టుకెళ్లిపోవచ్చు

ఇంగ్లండ్ – పాక్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తిలకించడానికి భారీగానే ప్రేక్షకులు వచ్చారు. మ్యాచ్ 9 ఓవర్ జరుగుతోంది. ఈ సమయంలో పాక్ ఆటగాళ్లు రిజ్వాన్, ఫఖార్ బ్యాటింగ్ చేస్తున్నారు. అనూహ్యంగా అందరి దృష్టి ఓ యువకుడు, ఓ యువతిపై నెలకొంది. వీరి వెనుకాలే ఉన్న వారు చేయిలు ఊపుతూ హాయ్ చెబుతున్నారు.

Read More : Aha : ప్రేక్ష‌కుల ఆద‌రణ‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ‘నీడ‌’, ‘హీరో’ చిత్రాల‌తో ఈ వీకెండ్ ‘ఆహా’ సంద‌డి..

అయితే..ఆ యువకుడు తలపై ఉన్న టోపి తీసి..చేతిలో ఉంగం పట్టుకుని మోకాళ్లపై కింద కూర్చొన్నాడు. ఆ యువతి దీనిని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. దీనికి కామెంటర్ కూడా వాయిస్ కలిపారు. ఇక్కడ ఏమి జరుగుతోంది. 22 వేల మంది ముందు ప్రపోజ్ చేశాడు..అయితే..డెసిషన్ పెండింగ్ లో ఉంది..అంతలోనే..ఆ యువతి ఉంగరం తీసుకుని చేతి వేలికి పెట్టుకున్నారు. ఓ…యెస్ చెప్పేసింది అంటూ…కామెంట్ చేశారు. ఎస్ అని చెప్పిన ఆ యువతి…ఆనందభాష్పాలు రాల్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా England Cricket ట్వీట్ చేసింది.