Use and Use Stadium: సాకర్ ప్రపంచకప్‌ కోసం..స్పెషల్ స్టేడియం…విప్పేసి పట్టుకెళ్లిపోవచ్చు

2022లో సాకర్‌ ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. దీని కోసం ఓ వినూత్నమైన వినూత్నమైన స్టేడియంను రూపొందిస్తున్నారు ఖతార్‌లో. ఇది వెరీ వెరీ డిఫరెంట్. దీని ప్రత్యేకత ‘‘యూజ్‌ అండ్‌ యూజ్‌ స్టేడియం’’. ఖతార్‌లోని రాస్‌ అబు అబౌడ్‌ స్టేడియంలో ఈ యూస్ అండ్ యూజ్ స్టేడియం రూపుదిద్దుకుంటోంది.

Use and Use Stadium: సాకర్ ప్రపంచకప్‌ కోసం..స్పెషల్ స్టేడియం…విప్పేసి పట్టుకెళ్లిపోవచ్చు

Ras Abu Aboud Stadium (1)

Ras Abu Aboud stadium 2022: 2022లో సాకర్‌ ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. దీని కోసం ఓ వినూత్నమైన స్టేడియంను తయారు చేస్తున్నారు మైదానాన్ని రూపొందిస్తున్నారు ఖతార్‌లో. ఇది అలాటింలాంటి స్టేడియం కానేకాదు. వెరీ వెరీ డిఫరెంట్. దీని ప్రత్యేకత ‘‘యూజ్‌ అండ్‌ యూజ్‌ స్టేడియం’’. అదేంటీ యూజ్‌ అండ్‌ యూజ్‌ స్టేడియం అంటే అదే మరి దీని ప్రత్యేకత.

యూజ్‌ అండ్‌ త్రో వస్తువుల గురించి విన్నారు. ఈరోజుల్లో అటువంటి వస్తువులు ఎన్నో..ఎన్నెన్నో..పెన్నుల నుంచి గన్నుల వరకూ అన్నట్లుగా ఉంది. చేతి రుమాలు నుంచి వాటర్ బాటిల్ వరకూ అంతా యూజ్‌ అండ్‌ త్రోలే. కానీ సాకర్ వరల్డ్ కప్ కోసం తయారు చేసే స్టేడియం తయారు చేయటమేంటీ? నిర్మించటం అంటాం కదా? అనే డౌట్ వస్తుంది. అదే మరి ఈ స్టేడియం స్పెషాలిటీ..దీన్ని కావాల్సిన చోట రూపొందించి..పని అయ్యాక దాన్ని విప్పేసి మరోచోటికి పట్టుకెళ్లిపోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ అంటే దానికి తగిన స్థలం ఉన్నచోట మళ్లీ దాన్ని నిర్మించవచ్చు. అదే ఈ ‘యూజ్‌ అండ్‌ యూజ్‌’ స్టేడియం.

2022లో ప్రారంభంకానున్న సాకర్ వరల్డ్ కప్ కోసం ఖతార్‌లో సిద్ధమవుతోంది. అది ఖతార్‌లోని రాస్‌ అబు అబౌడ్‌ స్టేడియం. సాకర్ ప్రపంచకప్‌ కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ఇప్పుడు అక్కడ కేవలం మైదానం మాత్రమే ఉంది. అంటే ఖాళీగా..కుర్చీలు, సీలింగ్‌, లైట్స్ ఏమీ ఉండవ్. అంతేకాదు ప్రపంచకప్‌ టోర్నీ అయ్యాక కూడా అవేవీ అక్కడ ఉండవు. అంటే మ్యాచ్‌లు అయిపోయాక మొత్తం స్డేడియాన్ని దేనికదే విప్పేసి… తీసుకెళ్లిపోతారు. అదే ఈ ‘యూజ్‌ అండ్‌ యూజ్‌’ స్టేడియం. ఉపయోగించాక మళ్లీ ఉపయోగించేలా ఉండేది అని అర్థం.

ఈ స్టేడియం రూపొందించటానికి దోహా పోర్టులో షిప్పింగ్‌ కంటైనర్ల నుంచి 974 కంటైనర్లను తీసుకొని..వాటి ఉక్కుతో 40 వేల సీటింగ్ సామర్థ్యం కలిగే స్టేడియం పనులు చేపడుతున్నారట.ఆ సీట్లన్నీ రిమూవబుల్‌వే. అంటే రీసైకిల్డ్‌ విధానంలో ఈ మైదానం రూపొందుతోందనే విషయం అర్థం అయ్యే ఉంటుంది.

ఈ స్టేడియం నిర్మాణంలో 974 కంటైనర్లు మాత్రమే వాడటానికీ ఓ కారణం కూడా ఉందండోయ్..అది ఖతార్‌ డయలింగ్‌ కోడ్‌. దేశ పునరుత్పాదకతను , చిహ్నాన్ని తెలిపేలా ఈ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇక మ్యాచ్‌లు అయిపోయాక మొత్తం స్టేడీయంలో గ్రౌండ్‌ మాత్రమే అక్కడ ఉంటుంది. సీలింగ్‌, కుర్చీలు, ఇతర వస్తువులను అక్కడి నుంచి తరలించేస్తారు. వాటిని వేరే ప్రాంతంలో ఆటల కోసం..అంటే స్టేడియం ఏర్పాట్ల కోసం వాడతారు. ఖతార్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాలకూ వాటిని తరలించే అక్కడ కూడా నిర్మించి అక్కడి అవసరం తీరిపోయాక దాన్ని మరోచోటికి అలా ఆ స్టేడియం తిరుగుతు ఉంటుంది.

రాస్‌ అబు అబౌడ్‌ స్టేడియాన్ని దేనికది విప్పేశాక… ఆ సామాగ్రిని రెండు చిన్న స్టేడియంలుగాను, లేదంటే ఓ పెద్ద స్టేడియంగాను మార్చుకోవచ్చని స్టేడియం నిర్వాహకులు చెబుతున్నారు. అవసరమైతే ఈ పార్టులను వేరే దేశాలకు డొనేట్‌ చేయడానికి కూడా ఖతార్‌ రెడీగా ఉందటం..వినూత్నంగా ఆలోచించటమే కాదు ఆదాయాన్ని పెంచుకోవాటంలో కూడా ఖతార్ భలే డిఫరెంట్ గా ఆలోచిస్తుందని అర్థం అవుతోంది.

అంతేకాదు పోటీల సమయంలో వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌ను హ్యాండిల్‌ చేయడానికి స్టేడియం చుట్టూ పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారట. 2022 జూన్‌లో మ్యాచ్‌లు జరిగే ఈ మ్యాచ్ ల విషయాన్నికొస్తే ఇక్కడ ఏడు మ్యాచ్‌లు మాత్రమే జరుగనున్నాయి.