Deepti Sharma Creates History Becomes 1st Indian womens Cricketer
Deepti Sharma : టీమ్ఇండియా ప్లేయర్ దీప్తిశర్మ చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. హాఫ్ సెంచరీతో చేయడంతో పాటు మూడు వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలో ప్రపంచకప్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కింది. కాగా.. వన్డే క్రికెట్‌లో హాఫ్ సెంచరీతో పాటు మూడు వికెట్లు పడగొట్టడం దీప్తికి (Deepti Sharma) ఇది రెండో సారి కావడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. నిర్ణీత ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.
Nepal : చరిత్ర సృష్టించిన నేపాల్.. వెస్టిండీస్ పై సిరీస్ విజయం.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే..
టీమ్ఇండియా ప్లేయర్లలో అమన్‌జ్యోత్ కౌర్ (57; 56 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), దీప్తి శర్మ (53; 53 బంతుల్లో 3 ఫోర్లు), హర్లీన్ డియోల్ (48; 64 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు. స్టార్ ప్లేయర్లు స్మృతి మంధాన (8), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (0)లు విఫలం అయ్యారు. లంక బౌలర్లలో ఇనోకా రణవీర నాలుగు వికెట్లు తీసింది. ఉదేశిక ప్రబోధని రెండు వికెట్లు పడగొట్టింది. అచ్చిని కులసూర్య, చమరి ఆటపట్టు చెరో వికెట్ సాధించారు.
ఆ తరువాత శ్రీలంక లక్ష్యాన్ని 271 పరుగులకు సవరించారు. చమరి ఆటపట్టు (43), నిలాక్షిక (35), హర్షిత (29) రాణించగా మిగిలిన వారు విఫలం కావడంతో లంక జట్టు 45.4 ఓవర్లలో 211 పరుగులకు కుప్పకూలింది.
IND vs PAK : అలర్ట్.. మరో ఐదు రోజుల్లో భారత్, పాక్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్.. ఈ సారి..
దీంతో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 59 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు తీసింది. స్నేహరాణ, శ్రీ చరణి చెరో రెండు వికెట్లు తీశారు. క్రాంతి గౌడ్, అమంజోత్ కౌర్, ప్రతీకా రావల్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.