IND vs PAK : అలర్ట్.. మరో ఐదు రోజుల్లో భారత్, పాక్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్.. ఈ సారి..
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య అక్టోబర్ 5న మ్యాచ్ జరగనుంది.

ODI World Cup 2025 match between IndiaWomen Pakistan Women on october 5th
IND vs PAK : ఆసియాకప్ 2025 సమరం ముగిసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఓడించి భారత్ ఆసియాకప్ ను కైవసం చేసుకుంది. 41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో భారత్, పాక్ జట్లు తొలిసారి ఫైనల్ మ్యాచ్‌లో తలపడగా సూర్యకుమార్ నాయకత్వంలోని టీమ్ఇండియా విజయం సాధించింది. తొమ్మిదో సారి ఆసియాకప్ ట్రోఫీని ముద్దాడింది. భారత జట్టు ఏడు సార్లు వన్డే ఫార్మాట్‌లో గెలవగా, రెండు సార్లు టీ20 ఫార్మాట్‌లో ఆసియాకప్‌ను భారత్ కైవసం చేసుకుంది.
ఇరు దేశాల ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాక్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం లేదు. ఆసియాకప్ పుణ్యమా అని రెండు వారాల వ్యవధిలోనే మూడు సార్లు భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. ఈ మూడు సార్లు భారత్ గెలిచింది. ఇక ఇప్పడు మరోసారి ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అది కూడా కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే కావడం గమనార్హం.
Team India : పాక్ మీద గెలిచిన ఆనందంలో ఉన్న ఇండియాకి భారీ షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 నేటి నుంచి ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లు అన్ని శ్రీలంకలోని కొలంబో వేదికగానే జరగనున్నాయి.
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాక్ జట్ల మధ్య అక్టోబర్ 5న మ్యాచ్ జరగనుంది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌కు కొలంబో ఆతిథ్యం ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో టీమ్ఇండియా బరిలోకి దిగనుంది.
నేడే తొలి మ్యాచ్..
ఆతిథ్య దేశాలు భారత్, శ్రీలంక దేశాల మధ్య మంగళవారం (సెప్టెంబర్ 30న) జరగనున్న మ్యాచ్‌తో మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ప్రారంభం కానుంది.
Tilak Varma : హైదరాబాద్‌లో అడుగుపెట్టిన తిలక్ వర్మ.. అభిమానుల గ్రాండ్‌వెల్‌కమ్.. వీడియో వైరల్..
మహిళల వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలో భారత జట్టు షెడ్యూల్ ఇదే..
* సెప్టెంబర్ 30న – శ్రీలంకతో (గౌహతి)
* అక్టోబర్ 5న – పాకిస్తాన్‌తో (కొలంబో)
* అక్టోబర్ 9న – దక్షిణాఫ్రికాతో (వైజాగ్)
* అక్టోబర్ 12న – ఆస్ట్రేలియాతో (వైజాగ్)
* అక్టోబర్ 19న – ఇంగ్లాండ్ (ఇండోర్)
* అక్టోబర్ 23న – న్యూజిలాండ్ (నవీ ముంబై)
* అక్టోబర్ 26న – బంగ్లాదేశ్ (నవీ ముంబై)