Team India : పాక్ మీద గెలిచిన ఆనందంలో ఉన్న ఇండియాకి భారీ షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..
Team India : ఆసియా కప్ టోర్నీ విజేతగా నిలిచిన ఆనందంలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.

Team india
Team India Hardik Pandya : ఆసియా కప్ టోర్నీ ఫైనల్లో టీమిండియా పాకిస్థాన్ జట్టును చిత్తుచేసింది. టోర్నీ విజేతగా నిలిచిన ఆనందంలో ఉన్న ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా చాలాకాలం క్రికెట్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఆయన రాబోయే ఆస్ట్రేలియా పర్యటనకు పూర్తిగా దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. అయితే, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంక జట్టుతో జరిగిన ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ లో 31ఏళ్ల హార్ధిక్ పాండ్యా గాయపడ్డాడు. దీంతో వైద్యులు అతన్ని పరీక్షించి నాలుగు వారాలపాటు విశ్రాంత తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. అయితే, మ్యాచ్ గెలిచిన తరువాత జట్టు విజయోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. హార్దిక్ స్థానంలో రింకూసింగ్ పాకిస్థాన్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆడాడు.
Also Read: Asia Cup Final : తిలక్ వర్మ భారీ సిక్స్.. గౌతమ్ గంభీర్ రియాక్షన్ చూశారా.. వావ్.. వీడియో వైరల్..
నివేదిక ప్రకారం.. హార్దిక్ పాండ్యా ఎడమ క్వాడ్రిసెప్స్ గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అక్టోబర్ 19వ తేదీ నుంచి పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో మొదలయ్యే ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు పాండ్యా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఒకవేళ హార్దిక్ ఊహించిన దానికంటే వేగంగా కోలుకున్నా.. రాబోయే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు అందుబాటులో ఉండడు. అక్టోబర్ 29న హోబర్ట్‌లోని మనుకా ఓవల్ వేదికగా ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే, అదికూడా పాండ్యా త్వరగా కోలుకుంటేనే.
బీసీసీఐ వైద్య బృందం త్వరలోనే జట్టు యాజమాన్యానికి నివేదిక ఇస్తుందని తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా హార్దిక్ పాండ్యా భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆసియా కప్ టోర్నీలో హార్దిక్ పాండ్యా మొత్తం ఆరు మ్యాచ్ లు ఆడగా.. నాలుగు వికెట్లు పడగొట్టి.. 48 పరుగులు చేశాడు. సూపర్-4లో బంగ్లాదేశ్ జట్టుపై అతను అత్యధికంగా 38 పరుగులు చేశాడు.