Nepal : చరిత్ర సృష్టించిన నేపాల్.. వెస్టిండీస్ పై సిరీస్ విజయం.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే..
నేపాల్ జట్టు (Nepal )చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్‌పై మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ విజయాన్ని నమోదు చేసింది.

Nepal script historic series win over West Indies
Nepal : పసికూన నేపాల్ జట్టు చరిత్ర సృష్టించింది. రెండు సార్లు టీ20 ఛాంపియన్లు అయిన వెస్టిండీస్ పై తొలిసారి సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఐసీసీ టెస్టు ఆడుతున్న దేశాలపై ఓ ద్వైపాక్షిక సిరీస్‌ను గెలుచుకోవడం నేపాల్‌కు(Nepal) ఇదే తొలిసారి కావడం గమనార్హం.
షార్జా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో నేపాల్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు సాధించింది. నేపాల్ బ్యాటర్లలో ఆసిఫ్ షేక్ (68; 47 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), సందీప్ జోరా (63; 39 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు సాధించారు. విండీస్ బౌలర్లలో అకేల్ హోసేన్, కైల్ మేయర్స్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
IND vs PAK : అలర్ట్.. మరో ఐదు రోజుల్లో భారత్, పాక్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్.. ఈ సారి..
అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 17.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌటైంది. దీంతో విండీస్ 90 పరుగుల తేడాతో నేపాల్ విజయాన్ని అందుకుంది. విండీస్ బ్యాటర్లలో జేసన్ హోల్డర్ (17), అమీర్ జాంగో (16), అకీమ్ అగస్టే (17)లు రెండు అంకెల స్కోరు సాధించారు.
మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. నేపాల్ బౌలర్లలో మొహమ్మద్ ఆదిల్ ఆలం నాలుగు వికెట్లు తీశాడు. కుషాల్ భూర్తెల్ మూడు వికెట్లు సాధించాడు. లలిత్ రాజ్బన్షి, దీపేంద్ర సింగ్ ఐరీ, కరణ్ కేసీ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.