Delhi Capitals recreates ramcharan peddi shot video viral
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సోమవారం (మే5న) సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.
ఇందులో ఢిల్లీ ప్లేయర్ సమీర్ రిజ్వీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీ గ్లింప్స్‌లో ఆడిన షాట్‌ను రీక్రియేట్ చేశాడు. ఈ వీడియోను పెద్ది గ్లింప్స్ ఆడియోతో ఎడిట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
PM Modi-Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ పై మోదీ ప్రశంసల జల్లు..
Amazing one @delhicapitals 💥
Thank you for all your efforts to recreate the #PeddiFirstShot ❤️🔥All the best for today’s match 🤝
Can’t wait for our @Sunrisers comeback 🔥
A thrilling contest today for all the cricket fans ❤🔥 pic.twitter.com/tLBCZGc5hF
— BuchiBabuSana (@BuchiBabuSana) May 5, 2025
దర్శకుడు బుచ్చిబాబు ఈ వీడియో పోస్ట్ చూస్తూ.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ధన్యవాదాలు తెలియజేశాడు. ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అదే సమయంలో సన్‌రైజర్స్ కమ్‌బాక్ ఇవ్వాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశాడు.
ఈ వీడియో వైరల్‌గా మారగా.. మెగా అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Viral Video : అదెం గుండెరా బాబు.. జేబులోనే పెట్టుకొని వచ్చాడుగా.. పరిగెడుతుండగా జారిపడింది..
ఇక ఢిల్లీతో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎంతో కీలకం. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఢిల్లీతో మ్యాచ్‌లో తప్పక విజయం సాధించాలి. ఒకవేళ ఓడిపోతే మాత్రం సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమిస్తుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్ 10 మ్యాచుల్లో ఆడింది. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. 6 పాయింట్లు ఖాతాలో నెట్‌రన్‌రేట్ -1.192గా ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉంది.
అటు ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఢిల్లీ ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 12 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేట్ +ఉంది0.362గా . ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ పై విజయం సాధించి టాప్-4లోకి దూసుకువెళ్లాలని ఢిల్లీ పట్టుదలతో ఉంది.