PM Modi-Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ పై మోదీ ప్రశంసల జల్లు..
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్య వంశీ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కరిపించారు

PM Narendra Modi Praise 14 Year Old IPL Wonderkid Vaibhav Suryavanshi
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్య వంశీ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కరిపించారు. చిన్నవయసులోనే అతడు అసాధారణ ప్రదర్శన చేస్తున్నాడని మెచ్చుకున్నారు. బీహార్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ప్రారంభించిన తరువాత మోదీ మాట్లాడారు.
‘ఐపీఎల్‌లో బిహార్ బిడ్డ వైభవ్ సూర్యవంశీ ఆటను చూశాను. ఎంతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంత చిన్న వయసులో గొప్ప రికార్డు నెలకొల్పాడు. అతడి ఆట వెనుక ఎంతో కష్టం ఉంది.’ అని ప్రధాని అన్నారు. క్రీడాకారులు ఎంత ఎక్కువగా ఆడితే అంత బాగా మెరుగు అవుతారని ప్రధాని తెలిపారు. ఎన్‌డీఏ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
Digvesh Rathi : దిగ్వేష్ మళ్లీ నోట్‌బుక్ సంబరాలు.. ఈ సారి ఏమవుతుందో?
మన అథ్లెట్లకు కొత్త క్రీడలు ఆడేందుకు ఎక్కువ అవకాశాలు కల్పించడం పై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు. ఇందులో భాగంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో గట్కా, ఖోఖో, మల్కాంబ్, యోగాసన అనే కొత్త క్రీడలను చేర్చినట్లు వివరించారు. జీవితంలో ప్రతి అంశంలో క్రీడా స్ఫూర్తి కీలకమైన పాత్రను పోషిస్తుందని తెలుసు. క్రీడల ద్వారా ఓ జట్టుగా కలిసి కట్టుగా ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకుంటాం.’ అని మోదీ అన్నారు.
ఐపీఎల్‌లో అతి తక్కువ వయసులో అరంగ్రేటం చేసిన ఆటగాడిగా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేసిన తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే నిష్ర్కమించింది.