ఢిల్లీ క్యాపిటల్స్‌ను తిట్టిపోసిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

ఢిల్లీ క్యాపిటల్స్‌ను తిట్టిపోసిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

Updated On : April 2, 2019 / 12:00 PM IST

పుండు మీద కారం చల్లినట్లు .. అసలే కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ చేతిలో 14పరుగుల తేడాతో చిత్తు అయింది ఢిల్లీ క్యాపిటల్స్‌. అది చాలదన్నట్లు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ట్విట్టర్ వేదికగా తిట్టిపోశాడు. పంజాబ్‌లోని మొహాలి వేదికగా జరిగిన పోరుతో పంజాబ్ జట్టు హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. చేధనకు దిగిన పంజాబ్ మ్యాచ్ చివరి ఓవర్లలో పేలవ బ్యాటింగ్ ప్రదర్శించి వికెట్లను కోల్పోయింది. 

ఆఖరి 3ఓవర్లలో 18 పరుగులు కావల్సి ఉండగా చేతిలో ఉన్న 8వికెట్లను నిలుపుకోలేకపోయింది. వారి పతనాన్ని వారే కొనితెచ్చుకున్నారు. గత మ్యాచ్ లోనూ చేధనలో విఫలమైన ఢిల్లీని సూపర్ ఓవర్లో కగిసో రబాడ ఆదుకున్నాడు. దీనిపై స్పందించిన మైకెల్ వాన్ .. ఢిల్లీ గత సంవత్సరాల ఫలితాలను పోల్చుతూ ట్వీట్ చేశాడు.

 ‘ఢిల్లీ డేర్‌డెవిల్స్ తన పాత ప్రదర్శననే కనబరుస్తున్నంది. అది చూడడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ సీజన్‌లో జట్టులో మార్పులు చేర్పులు చేసి బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తలరాత మారుతుందని భావిస్తే ఏ మాత్రం లాభం లేకుండాపోయింది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాతి మ్యాచ్‌లోనే చెన్నై ముందు మోకరిల్లింది. మరో సారి కోల్‌కతాపై అనూహ్య విజయాన్ని దక్కించుకున్నప్పటికీ దానిని నిలుపుకోలేకపోయింది.