Courtesy BCCI
లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠికి బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఐపీఎల్‌లో పదే పదే లీగ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడి పై ఒక మ్యాచ్ సస్సెన్షన్ విధించింది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో కు దిగ్వేశ్ రాఠి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదే అతడికి మొదటి సీజన్. అయినప్పటికి బౌలింగ్‌లో చక్కని ప్రదర్శన చేస్తున్నాడు. కానీ వికెట్ తీసిన సమయంలో అతడు జరుపుకునే సెలబ్రేషన్స్ పై బీసీసీఐ ఇప్పటికే పలుమార్లు మండిపడింది. నోట్‌బుక్ సెలబ్రేషన్స్ చేసినందుకు గాను ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు సార్లు జరిమానా ఎదుర్కొన్నాడు.
Mumbai Indians : ముంబై నెత్తిన పాలు పోసిన సన్‌రైజర్స్.. ఇక హార్దిక్ సేన ఈజీగా ప్లేఆఫ్స్‌కు..
ఇక సోమవారం ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఆటగాడు అభిషేక్ శర్మ ను ఔట్ చేసిన తరువాత దిగ్వేశ్ నోటుబుక్ సంబురాలు చేసుకున్నాడు. పెవిలియన్‌కు వెలుతున్న అభిషేక్.. అతడిని చూస్తూ ఏదో అన్నాడు. దీంతో దిగ్వేశ్ దూకుడుగా అభిషేక్ వైపు దూసకువెళ్లి అతడితో వాగ్వాదానికి దిగాడు. వీరి మధ్య మాటలు యుద్ధం నడిపించింది. ఆటగాళ్లు, అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అభిషేక్ పెవిలియన్‌కు వెళ్లాడు.
🚨 DIGVESH RATHI SUSPENDED. 🚨
– Digvesh has been fined 50% of his match fees and suspended Vs GT.
– Abhishek Sharma also fined 25%. pic.twitter.com/cmmxnLqHk7
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 20, 2025
అభిషేక్‌తో గొడవ పడడంతో ఐపీఎల్ ప్రవర్తనా నియావళిని దిగ్వేశ్ ఉల్లంఘించినట్లైంది. ఈ సీజన్‌లో దిగ్వేశ్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం ఇది మూడో సారి కావడం గమనార్హం. ఈ క్రమంలో అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. అంతేకాదండోయ్ అతడి ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్ల చేర్చారు.
దీంతో ఈ సీజన్‌లో అతడి ఖాతాలో ఐదు డీమెరిట్ పాయింట్లు (ఏప్రిల్ 01 పంజాబ్ కింగ్స్‌పై ఒక డీమెరిట్ పాయింట్, ఏప్రిల్ 04 ముంబై ఇండియన్స్‌పై రెండు డీమెరిట్ పాయింట్లు) చేరినట్లైంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. నాలుగు డీమెరిట్ పాయింట్లు దాటితే ఓ మ్యాచ్ సస్పెషన్ విధించబడుతుంది. ఈ క్రమంలోనే దిగ్వేశ్ ఓ మ్యాచ్ సస్పెషన్‌కు గురి అయ్యాడు. దీంతో అతడు మే 22 గురువారం గుజరాత్ టైటాన్స్‌తో లక్నో జట్టు ఆడే మ్యాచ్‌లో ఆడడు
అభిషేక్‌కు జరిమానా..
మరో వైపు ఎస్ఆర్‌హెచ్ ఆటగాడు అభిషేక్ వర్మకు జరిమానా పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు గాను అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ వేశారు. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ ను చేర్చారు. ఈ సీజన్‌లో అభిషేక్ ఐపీఎల్ ప్రవర్తనా నియమాళిని ఉల్లఘించడం ఇదే తొలిసారి.
ABHISHEK vs DIGVESH MOMENT 🤯 pic.twitter.com/oEfs0LWhoe
— Johns. (@CricCrazyJohns) May 19, 2025