Dimuth Karunaratne: 100వ టెస్టుతో గుడ్ బై.. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక మాజీ కెప్టెన్

శ్రీలంక మాజీ కెప్టెన్ దిముత్ కరుణ రత్నే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఫిబ్రవరి 6వ తేదీన గాలెలో శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

Dimuth Karunaratne

Dimuth Karunaratne: శ్రీలంక మాజీ కెప్టెన్ దిముత్ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఫిబ్రవరి 6వ తేదీన గాలెలో శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా దిముత్ కరుణరత్నే 100వ టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. అయితే, ఆ టెస్టు తరువాత రిటైర్మెంట్ అవుతున్నట్లు కరుణరత్నే ప్రకటించాడు. ‘‘ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు ముగిసిన తరువాతనే తదుపరి టెస్టు నా చివరి టెస్ట్ అని నేను శ్రీలంక క్రికెట్ బోర్డుకు తెలియజేశాను. నేను అరంగ్రేటం చేసింది గాలె అంతర్జాతీయ స్టేడియంలోనే.. ప్రస్తుతం తన వందో టెస్టు మ్యాచ్ కూడా జరుగుతుంది. కాబట్టి రిటైర్మెంట్ ప్రక్రియను అక్కడే పూర్తి చేయడం మంచిదని నిర్ణయించుకున్నా’’ అంటూ కరుణరత్నే ESPNcricinfoతో మాట్లాడుతూ చెప్పాడు.

Also Read: ఓర్నీ.. విరాట్ కోహ్లీని ఔట్ చేయడం ఇంతఈజీనా.. బస్సు డ్రైవర్ తనకు సూచనలు చేశాడన్న బౌలర్ హిమన్షు సంఘ్వాన్

కరుణరత్నే తన 14ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ టెస్టు కెరీర్ లో ఎన్నో కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఈ క్రమంలో అనేకసార్లు శ్రీలంక జట్టును విజయతీరాలకు చేర్చాడు. కెరీర్ లో ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన అతను.. 189 ఇన్నింగ్స్ లో 7,172 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డేల్లో 1,316 పరుగులు చేయగా.. ఇందులో ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Also Read: Abhishek Sharma : వండర్ ఫుల్.. అభిషేక్ శర్మ మరో వెరైటీ రికార్డు.. కోహ్లీ, సూర్య, గిల్ సరసన..

2012లో గాలె అంతర్జాతీయ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా కరుణరత్నే తన టెస్టు కెరీర్ ను ప్రారంభించాడు. తొలి టెస్టులోనే డకౌట్ అయ్యాడు. ఆ తరువాత టెస్టు నుంచి పరుగులు రాబడుతూ క్రమంలో శ్రీలంక జట్టులో కీలక ప్లేయర్ గా ఎదిగాడు. అయితే, గత కొద్దికాలంగా పరుగులు రాబట్టడంలో కరుణరత్నే విఫలమవుతున్నాడు. చివరి ఏడు టెస్టుల్లో కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో 36ఏళ్ల కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం బెటర్ అని భావించాడు.

టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన కారణంగా కరుణరత్నే 2018, 2021, 2023 సంవత్సరాల్లో ‘ఐసీసీ టెస్టు క్రికెట్ టీమ్ ఆఫ్ ది ఇయర్’కు ఎంపికయ్యాడు. ఇదిలాఉంటే.. ఫిబ్రవరి 6వ తేదీన జరిగే టెస్టులో తన 100వ టెస్టు ఆడటం ద్వారా శ్రీలంక తరపున ఈ ఘనత సాధించిన ఏడో క్రికెటర్ గా కరుణరత్నే అవతరించనున్నాడు.