IPL 2023: డీకేని ధోనీతో పోల్చిన వారిని జైలుకి పంపాలి.. అంటూ ట్రోలింగ్.. ఎందుకంటే?

IPL 2023: దినేశ్ కార్తీక్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మీమ్స్ సృష్టిస్తున్నారు.

IPL 2023: డీకేని ధోనీతో పోల్చిన వారిని జైలుకి పంపాలి.. అంటూ ట్రోలింగ్.. ఎందుకంటే?

Dinesh Karthik

Updated On : April 15, 2023 / 7:07 PM IST

IPL 2023: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) బ్యాటర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) పై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో శనివారం జరిగిన మ్యాచులో దినేశ్ కార్తీక్ మళ్లీ డకౌట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో లలిత్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుత ఐపీఎల్ (IPL 2023)లో దినేశ్ కార్తీక్ ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో స్కోరు 0(3 బంతులు), 9 (8), 1(1)*, 0(1)గా నమోదైంది.

క్రీజులోకి రావడం ఆ వెంటనే తిరిగి వెళ్లిపోవడం అతడికి పరిపాటిగా మారిందని నెటిజన్లు మీమ్స్ సృష్టిస్తున్నారు. దినేశ్ కార్తీక్ ని ఆర్సీబీ ఫ్యాన్స్ మహేంద్ర సింగ్ ధోనీతో పోల్చేవారని, డీకే మాత్రం ఇలా దారుణంగా డకౌట్ అయి వెనుదిరుగుతున్నాడని సెటైర్లు వేస్తున్నారు.

దినేశ్ కార్తీక్ ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకు మొత్తం 13 బంతులు ఆడి 10 పరుగులు చేశాడని, అతడు ఇక కామెంటరీ ప్యానెల్ కు వెళ్లి అక్కడ స్థిరపడాలని కొందరు సూచిస్తున్నారు. ధోనీతో దినేశ్ కార్తీన్ ను పోల్చిన వారిని జైలులో వేయాలని కొందరు సెటైర్లు వేశారు. గుడ్, బెస్ట్ ఫినిషరా? తొక్కా? అంటూ కొందరు జోకులు వేశారు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్లు అయిన బ్యాటర్ గానూ దినేశ్ కార్తీక్ నిలిచాడు. దినేశ్ కార్తీక్ మొత్తం 15 సార్లు డకౌట్ అయ్యాడు. అలాగే, మందీప్ సింగ్ కూడా 15 సార్లు డకౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ 14 సార్లు, సునీత్ నరైన్ 14 సార్లు డకౌట్ అయ్యాడు. మహేంద్ర సింగ్ ధోనీ ఫాంలోలేని సమయంలో అతడికి ఎదురైన పరిస్థితి కంటే దినేశ్ కార్తీక్ పరిస్థితి మరింత దారుణంగా ఉందని కొందరు అంటున్నారు.

IPL 2023: అత్యధిక సిక్సులు కొట్టిందెవరు?.. పాయింట్ల పట్టికలో ముందంజలో ఏయే జట్లు?