×
Ad

Dubai Cricket Stadium : ఆసియాక‌ప్ ఫైన‌ల్‌.. దుబాయ్‌లో అత్య‌ధిక విజ‌య‌వంత‌మైన ల‌క్ష్య ఛేద‌న ఎంతో తెలుసా?

దుబాయ్ వేదిక‌గా (Dubai Cricket Stadium) ఆదివారం భార‌త్‌, పాక్ జ‌ట్లు ఆసియాక‌ప్ 2025 ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి.

Do you know Highest successful run chase in T20I at Dubai Cricket Stadium

Dubai Cricket Stadium : ఆసియాక‌ప్ 2025 చివ‌రి అంకానికి చేరుకుంది. దుబాయ్ వేదిక‌గా నేడు (ఆదివారం సెప్టెంబ‌ర్ 28) ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు ఈ మ్యాచ్‌లో క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్ భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 8 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.

ఈ క్ర‌మంలో దుబాయ్‌లోని పిచ్ ఎలా స్పందిస్తుంది? భారీ స్కోర్లు న‌మోదు అవుతాయా ? ఈ గ్రౌండ్‌లో అత్య‌ధిక ల‌క్ష్య ఛేద‌న ఎంత అనే విష‌యాల‌ను ఓ సారి చూద్దాం..

సాధార‌ణంగా దుబాయ్‌లోని పిచ్‌లు (Dubai Cricket Stadium)ఎక్కువ‌గా స్పిన్‌కు అనుకూలిస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక ఫైన‌ల్ మ్యాచ్‌లో కూడా స్పిన్న‌ర్ల‌కు ఉప‌యుక్తంగా ఉండే అవ‌కాశం ఉంది. రెండు జ‌ట్ల‌లోనూ మెరుగైన స్పిన్న‌ర్లు ఉన్న నేప‌థ్యంలో ఎవ‌రు స్పిన్న‌ర్ల బౌలింగ్‌లో బాగా ఆడ‌తారో వారే విజేత‌గా నిలిచే అవ‌కాశం ఉంది.

Mithun Manhas : బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్‌ మన్హాస్‌

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఈ మైదానంలో 185 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు ఏ జ‌ట్టు ఛేదించ‌లేదు. అంటే తొలుత బ్యాటింగ్ చేసిన జ‌ట్టు 190 ప‌రుగులు చేస్తే గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక్క‌డ అత్య‌ధిక ప‌రుగుల ల‌క్ష్యాన్నిఛేదించిన రికార్డు శ్రీలంక పేరిట ఉంది. 2022లో బంగ్లాదేశ్ పై లంక జ‌ట్టు 8 వికెట్ల కోల్పోయి 184 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించింది.

దుబాయ్ వేదిక‌గా చివ‌రి మ్యాచ్ భార‌త్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య గ‌త శుక్ర‌వారం జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 202 ప‌రుగులు చేసింది. లంక జ‌ట్టు కూడా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి స‌రిగ్గా 202 ప‌రుగులే చేసింది. ఇరు జ‌ట్లు స‌మాన స్కోర్లు సాధించ‌డంతో మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. సూప‌ర్ ఓవ‌ర్‌లో భార‌త్ విజ‌యం సాధించింది.

Hardik Pandya : పాకిస్తాన్‌తో ఫైన‌ల్ మ్యాచ్‌.. హార్దిక్‌కు సెంచ‌రీ చేసే గోల్డెన్ ఛాన్స్‌..

దుబాయ్ స్టేడియంలో టీ20ల్లో విజ‌య‌వంత‌మైన అత్య‌ధిక ల‌క్ష్య ఛేద‌న‌లు ఇవే..

* 184/8 (లక్ష్యం 184) – బంగ్లాదేశ్‌పై శ్రీలంక 2 వికెట్ల తేడాతో విజయం (2022లో)
* 182/5 (లక్ష్యం 182) – భార‌త్ పై 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజ‌యం (2022లో)
* 183/5 (లక్ష్యం 180) – యూఏఈ పై అఫ్గానిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజ‌యం (2016లో)
* 177/5 (లక్ష్యం 177) – పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజ‌యం (2021లో)
* 174/4 (లక్ష్యం 174) – భారత్ పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజ‌యం (2022లో )