IPL-Super Over : ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్‌లో ఎన్ని సూప‌ర్ ఓవ‌ర్‌లు జ‌రిగాయో తెలుసా?.. చ‌రిత్ర సృష్టించిన ఢిల్లీ

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్‌లు జ‌రిగాయో మీకు తెలుసా?

Courtesy BCCI

ఐపీఎల్ 2025 లో భాగంగా బుధ‌వారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసిన సంగ‌తి తెలిసిందే. ఇరు జ‌ట్లు స‌మాన స్కోరు చేయ‌డంతో మ్యాచ్ ఫ‌లితం తేల్చేందుకు సూప‌ర్ ఓవ‌ర్ అనివార్య‌మైంది. ఈ సూప‌ర్ ఓవ‌ర్‌లో ఢిల్లీ జ‌ట్టు విజ‌యం సాధించింది.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఎన్ని సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్‌లు జ‌రిగాయి. ఏ జ‌ట్టు అత్య‌ధికంగా సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్‌ల‌ను ఆడింది. ఏ జ‌ట్టు అత్య‌ధిక సార్లు సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్‌ల‌ను గెలిచింది అన్న సంగ‌తి ఇప్పుడు చూద్దాం.

BCCI-Team India : టెస్టు సిరీసుల్లో భార‌త్ ఘోర ఓట‌మి.. స‌హాయ‌క సిబ్బందిపై బీసీసీఐ వేటు.. నెక్ట్స్ ఆట‌గాళ్లేనా?

2008లో ఐపీఎల్ ప్రారంభ‌మైంది. తాజాగా ఢిల్లీ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ మ్యాచ్‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 15 సూప‌ర్ ఓవ‌ర్ ఓవ‌ర్లు జ‌రిగాయి. ఇందులో ఢిల్లీ క్యాపిట‌ల్స్ అత్య‌ధికంగా సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్‌ల‌ను ఆడింది. ఏకంగా ఐదు సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్‌లు ఆడ‌గా.. నాలుగు సార్లు ఆ జ‌ట్టు విజ‌యం సాధించడం విశేషం.

ఈ క్ర‌మంలో సూప‌ర్ ఓవ‌ర్‌లో అత్య‌ధిక విజ‌యాలు సాధించిన జ‌ట్టుగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ చ‌రిత్ర సృష్టించింది. ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. నాలుగు సార్లు ఆ జ‌ట్టు సూప‌ర్ ఓవ‌ర్‌ల‌ను ఆడ‌గా మూడు సార్లు విజేత‌గా నిలిచింది.

ఐపీఎల్‌లో సూప‌ర్ ఓవ‌ర్ ల లిస్ట్ ఇదే..

* 2009లో రాజస్థాన్ రాయల్స్ వ‌ర్సెస్‌ కోల్‌కతా నైట్ రైడర్స్ – విజేత రాజ‌స్థాన్‌
* 2010లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వ‌ర్సెస్‌ చెన్నై సూపర్ కింగ్స్ – విజేత పంజాబ్ కింగ్స్‌
* 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వ‌ర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – విజేత హైద‌రాబాద్‌
* 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వ‌ర్సెస్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ – విజేత బెంగ‌ళూరు
*2014లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – విజేత రాజ‌స్థాన్‌
* 2015లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ – విజేత కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌
* 2017లో గుజ‌రాత్ ల‌య‌న్స్ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్ – విజేత ముంబై ఇండియ‌న్స్‌
* 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ వ‌ర్సెస్‌ కోల్‌కతా నైట్ రైడర్స్ – విజేత ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

IPL 2025 : స‌లైవా గేమ్ ఛేంజ‌రా? సూప‌ర్ ఓవ‌ర్ హీరో మిచెల్ స్టార్క్ షాకింగ్ ఆన్స‌ర్‌..

* 2019లో ముంబై ఇండియన్స్ వ‌ర్సెస్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్ – విజేత ముంబై
* 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ వ‌ర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ – విజేత ఢిల్లీ
* 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వ‌ర్సెస్ ముంబై ఇండియన్స్ – విజేత బెంగ‌ళూరు
* 2020లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ – విజేత కోల్‌క‌తా
* 2020లో ముంబై ఇండియ‌న్స్ వ‌ర్సెస్ కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ – విజేత పంజాబ్‌
*2021లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ – విజేత ఢిల్లీ
* 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌- విజేత ఢిల్లీ

DC vs RR : ఢిల్లీ పై సూప‌ర్ ఓవ‌ర్‌లో ఓట‌మి.. రాజ‌స్థాన్ కెప్టెన్ సంజూశాంస‌న్ కీల‌క వ్యాఖ్య‌లు..