Duleep Trophy 2024 : దులీప్ ట్రోఫీని ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా..?

క్రికెట్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న దులీప్ ట్రోఫీ సెప్టెంబ‌ర్ 5 నుంచి ప్రారంభం కానుంది.

Duleep Trophy

Duleep Trophy : క్రికెట్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న దులీప్ ట్రోఫీ సెప్టెంబ‌ర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీతోనే భార‌త దేశ‌వాలీ క్రికెట్ సీజ‌న్‌కు తెర‌లేవ‌నుంది. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో చోటు ద‌క్కాలంటే స్టార్ ఆట‌గాళ్లు అయినా స‌రే ఖ‌చ్చితంగా దేశ‌వాలీ క్రికెట్‌లో ఆడాల్సిందేన‌ని ఇటీవ‌ల బీసీసీఐ ఆట‌గాళ్ల‌కు కండిష‌న్స్ పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, జ‌స్‌ప్రీత్ బుమ్రా మిగిలిన ఆట‌గాళ్లంతా దులీప్ ట్రోఫీ ఆడనుండ‌డంతో టోర్నీ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఏ, బీ, సీ, బీ అంటూ భార‌త అగ్ర‌శేణి ఆట‌గాళ్ల‌తో కూడిన జ‌ట్ల‌ను ఇప్ప‌టికే బీసీసీఐ ప్ర‌క‌టించింది. రానున్న నాలుగు నెల‌ల్లో భార‌త జ‌ట్టు 10 టెస్టు మ్యాచులు ఆడ‌నుంది. ఈ క్ర‌మంలో ఇందులో రాణించిన కుర్రాళ్ల‌కు టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో మ్యాచుల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌తి జ‌ట్టు కూడా మిగిలిన జ‌ట్ల‌తో ఒక్కొ మ్యాచ్ ఆడ‌నుంది. అన్ని మ్యాచులు ముగిసిన త‌రువాత పాయింట్ల ప‌ట్టిక‌లో తొలి స్థానంలో నిలిచిన జ‌ట్టు విజేత‌గా నిల‌వ‌నుంది. ఒక్కొ మ్యాచ్ నాలుగు రోజుల పాటు జ‌ర‌గ‌నుంది.

BCCI : అబ్బే మా వ‌ల్ల కాదు.. ఐసీసీకి తేల్చిచెప్పిన బీసీసీఐ.. ఇప్పుడెలా మ‌రీ..?

సెప్టెంబ‌ర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమ్ఇండియా రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడ‌నుంది. దీంతో దులీఫ్ ట్రోలీలో రాణించిన ఆట‌గాళ్ల నుంచే జ‌ట్టును ఎంపిక చేస్తామ‌ని ఇప్ప‌టికే బీసీసీఐ వెల్ల‌డించింది. దీంతో ఆట‌గాళ్లు కూడా ఈ టోర్నీని చాలా సీరియ‌స్‌గా తీసుకున్నారు.

ఫ్రీగా ఎలా చూడొచ్చునంటే..?

దులీఫ్ ట్రోఫీ మ్యాచులు కూడా ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం కానున్నాయి. అధికారిక బ్రాడ్ కాస్ట‌ర్ స్పోర్ట్స్ 18 ఛానల్స్‌లో ప్ర‌సారం చేయ‌నుంది. ఇక ఓటీటీలో జియో సినిమాలో ప్ర‌సారం కానున్నాయి. జియో సినిమాలో ఫ్రీగా చూడొచ్చు.
జ‌ట్లు ఇవే..

టీమ్‌ A : శుభమన్ గిల్ (కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వాత్ కావరప్ప, కుమార్ కుశాగ్రా , శాశ్వత్ రావత్.

Sanju Samson : పాపం సంజూ శాంస‌న్‌.. కెరీర్ ఇక క్లోజ్ అయినట్టేనా..?

టీమ్ B : అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తి , జగదీషన్ (వికెట్ కీప‌ర్‌).

టీమ్ C : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మర్కండే, మయాంక్ మార్కండే (వికెట్ కీప‌ర్‌), సందీప్ వారియర్.

టీమ్ D : శ్రేయాస్ లియర్ (కెప్టెన్‌), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య ఠాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ భరత్ గుప్తా, కెఎస్ (వికెట్‌కీప‌ర్‌), సౌరభ్ కుమార్.

Virat Kohli : లండ‌న్ వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్న విరాట్ కోహ్లీ.. వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్ వార్తలు