Do you know Suryakumar Yadav performed against Pakistan in T20
Suryakumar Yadav : క్రికెట్‌లో భారత్, పాక్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరు దేశాల అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆసియాకప్‌లో భాగంగా భారత్, పాక్ జట్ల మధ్య సెప్టెంబర్ 14న ఈ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది.
ఈ మ్యాచ్‌లో రాణించిన ఆటగాడు రాత్రికి రాత్రే స్టార్ క్రికెటర్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక టీ20ల్లో విధ్వంసకర బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) పాక్ పై ఎలా ఆడతాడా అన్న ఆసక్తి అందరిలో ఉంది.
అయితే.. పాక్ పై సూర్య రికార్డు ఏమంత గొప్పగా లేదు. పాక్ పై సూర్య ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడాడు. 12.8 సగటుతో 64 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక స్కోరు 18 పరుగులు మాత్రమే. ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో చెలరేగి తన పేలవ రికార్డును సూర్య మెరుగుపరచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
టీ20ల్లో టీమ్ఇండియా తరుపున సూర్యకుమార్ యాదవ్ 84 మ్యాచ్‌లు ఆడాడు. 80 ఇన్నింగ్స్‌ల్లో 38.3 సగటుతో 167.3 స్ట్రైక్‌రేటుతో 2605 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు ఉన్నాయి. 21 అర్థశతకాలు ఉన్నాయి.
భారత్, పాక్ హెడ్ టు హెడ్ రికార్డు ఇదే..
టీ20 క్రికెట్‌లో భారత్, పాక్ జట్లు ఇప్పటి వరకు 13 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో భారత్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల్లో పాక్ గెలుపొందింది.