×
Ad

IND vs SA : విశాఖ‌లో టీమ్ఇండియా రికార్డు ఎలా ఉందో తెలుసా? సిరీస్ పోరులో విజేత‌గా నిలిచేది ఎవ‌రంటే?

భార‌త్, ద‌క్షిణాప్రికా జ‌ట్ల మధ్య‌ జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్ (IND vs SA ) ఆస‌క్తిక‌రంగా సాగుతోంది.

Do you know Team India Track Record in Visakhapatnam ACA-VDCA Cricket Stadium

IND vs SA : భార‌త్, ద‌క్షిణాప్రికా జ‌ట్ల మధ్య‌ జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. మొద‌టి వ‌న్డేలో భార‌త్ విజ‌యం సాధించ‌గా రెండో వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా గెలుపొందింది. దీంతో శ‌నివారం విశాఖ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డే మ్యాచ్ (IND vs SA) కీల‌కంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన జ‌ట్టు 2-1తో సిరీస్‌ను కైవ‌సం చేసుకోనుంది.

దీంతో ఈ మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్ విజేత‌గా నిలవాల‌ని ఇరుజ‌ట్లు భావిస్తున్నాయి. ఇప్ప‌టికే రెండు జ‌ట్లు విశాఖ‌కు చేరుకున్నాయి. మైదానంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మూడో వ‌న్డే మ్యాచ్‌కు విశాఖ‌లోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

Rohit Sharma : విశాఖ‌లో ద‌క్షిణాఫ్రికాతో మూడో వ‌న్డే.. రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..

కాగా.. ఈ మైదానంలో టీమ్ఇండియా రికార్డులు ఎలా ఉన్నావో ఓ సారి చూద్దాం..

ఈ మైదానంలో భార‌త జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు 10 వ‌న్డే మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 7 మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా గెలుపొందింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో స్టేడియం భార‌త ఫేవ‌రెట్ మైదానాల్లో ఒక‌టిగా మారింది. ఈ నేప‌థ్యంలో అచ్చొచ్చిన స్టేడియంలో విజ‌యం సాధించి సిరీస్‌ను భార‌త్ సొంతం చేసుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

మ‌రోవైపు ద‌క్షిణాఫ్రికా విష‌యానికి వ‌స్తే.. ఈ మైదానంలో ఇప్ప‌టి వ‌ర‌కు సౌతాఫ్రికా ఒక్క వ‌న్డే మ్యాచ్ కూడా ఆడ‌లేదు. అయితే.. 2019లో ఓ టెస్టు మ్యాచ్‌, 2022లో ఓ టీ20 మ్యాచ్ ఆడింది. ఆ రెండు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా ఓడిపోయింది.

Joe Root : టెస్టుల్లో స‌చిన్ అత్య‌ధిక ప‌రుగుల రికార్డును బ్రేక్ చేసేందుకు జోరూట్‌కు ఎన్ని ర‌న్స్ కావాలో తెలుసా?

ఇక విశాఖప‌ట్నంలోని పిచ్ బ్యాట‌ర్ల‌కు స్వ‌ర్గ‌ధామంగా ఉంటుంది. ఇక్క‌డ అత్య‌ధిక స్కోరు 387/5. 2019లో వెస్టిండీస్‌పై భారతదేశం న‌మోదు చేసింది. కాగా.. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోరు న‌మోదు కాగా.. విశాఖ‌లోనూ ప‌రుగుల విందు ఖాయంగా క‌నిపిస్తోంది.