Gujarat
Gujarat : సచిన్ పేరుతో రైల్వే స్టేషన్ ఉందని మీకు తెలుసా? గుజరాత్‌లోని సూరత్‌కి దగ్గర్లో ఉంది. ఈ పేరు ఆ స్టేషన్ ఎప్పటి నుంచో ఉన్నా రీసెంట్‌గా మన క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆ స్టేషన్‌కి వెళ్లడంతో తాజాగా వైరల్ అవుతోంది. ఆ స్టేషన్‌కి సచీన్ పేరు పెట్టారు సరే.. అది మన క్రికెటర్ సచిన్ పేరేనా? చదవండి.
BBL : ప్రమాదకరంగా మారిన పిచ్.. 6 ఓవర్ల తరువాత మ్యాచ్ రద్దు.. ఇదేం తొలిసారి కాదు..
ఎయిర్ పోర్టులు, బస్ స్టాప్‌లకు ప్రముఖుల పేర్లు పెడుతూ ఉంటారు. కానీ రైల్వే స్టేషన్లకు మాత్రం ఆ ఊరి పేరే ఉంటుంది. గుజరాత్‌లోని సూరత్‌కి దగ్గర్లో సచీన్ రైల్వే స్టేషన్ ఉంది. తెలియని వారు మన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు పెట్టారని ఊహించుకుంటారు. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఆ రైల్వే స్టేషన్ పేరుకి .. మన క్రికెటర్ సచిన్‌కి ఏ మాత్రం సంబంధం లేదు. సచీన్ అనేది ఆ ఊరి పేరట. పొరపాటున సచిన్ పేరు మీ ఊరికి పెట్టుకున్నారా? అని అడిగారో.. మా ఊరి పేరే సచిన్ పెట్టుకున్నాడని సమాధానం వస్తుంది.
ఈ ఊరు తాజాగా వార్తల్లోకి రావడానికి కారణం ఏంటంటే భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ నవంబర్ 28 న ఈ సచీన్ రైల్వే స్టేషన్ ముందు నిలబడి ఫోటో తీసుకున్నారు. ఇక్కడ గవాస్కర్ మాత్రమే కాదు.. ఇటువైపుగా ఎవరు వెళ్తున్నా ఆగి మరి ఫోటో తీసుకుంటారట. ఇక గవాస్కర్ ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ‘గత శతాబ్దంలో సూరత్ సమీపంలోని రైల్వే స్టేషన్‌కు ఎంతో దూరదృష్టితో నా అభిమాన క్రికెటర్ పేరు పెట్టారు. నాకెంతో ఇష్టమైన వ్యక్తి’ అంటూ పోస్టు చేశారు. దీంతో ఈ రైల్వే స్టేషన్ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది.
WI vs ENG : చారిత్రాత్మక విజయం.. 24 ఏళ్ల తరువాత ఇంగ్లాండ్ పై సిరీస్ గెలిచిన వెస్టిండీస్..
టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న భారతీయుడిగా గవాస్కర్ నిలిచారు. సచిన్ టెండూల్కర్ టెస్టులు, వన్డేలలో ఈ ఫీట్‌ను సాధించారు. రిటైర్మెంట్ తర్వాత బీసీసీఐ చీఫ్‌గా వ్యవహరించిన సునీల్ ఇటీవల తరచూ భారత జట్టు వ్యాఖ్యాత వ్యవహరిస్తున్నారు.