NZ vs PAK: పాక్-కివీస్ మ్యాచ్.. బాల్ వేస్తుండగా పవర్ కట్.. పాక్ బ్యాటర్ కు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా పవర్ కట్ అయింది.. ఈ క్రమంలో పాక్ బ్యాటర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

PAK vs NZ Match

NZ vs PAK: పాకిస్థాన్ తో మూడు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్ జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. శనివారం ఆఖరి మ్యాచ్ లో న్యూజిలాండ్ 43 పరుగుల తేడాతో పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా ఇన్నింగ్స్ ను 42 ఓవర్లకు కుదించారు. కివీస్ మొదట బ్యాటింగ్ చేయగా.. ఎనిమిది వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 40 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, ఈ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

Also Read: IPL 2025 : మారని చెన్నై తీరు.. వరుసగా మూడో ఓటమి

పాకిస్థాన్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో జాకబ్ డఫీ బౌలింగ్ వేస్తుండగా ఒక్కసారిగా ఫ్లడ్ లైట్స్ ఆఫ్ అయ్యాయి. జాకబ్ డఫీ పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని వదిలే క్రమంలో పవర్ కట్ అయ్యింది. దీంతో మైదానం మొత్తం చీకటిగా మారిపోయింది. అప్పటికే జాకబ్ డఫీ బంతిని డెలివరీ చేశాడు. స్ట్రయికింగ్ లో పాకిస్థాన్ బ్యాటర్ తయ్యబ్ తాహీర్ ఉన్నాడు. కరెంట్ ఆఫ్ కావటంతో ఒక్కసారిగా తాహీర్ క్రీజు నుంచి తప్పుకోవటంతో తృటిలో ప్రమాదం తప్పినట్లయింది.

Also Read: Retired Out-Retired Hurt : రిటైర్డ్ ఔట్‌కు రిటైర్డ్ హ‌ర్ట్‌కు మ‌ధ్య చాలా తేడా ఉంది? ఏంటో తెలుసా?

తాహీర్ ఒకవేళ క్రీజులోనే ఉండిఉంటే బాల్ వేగంగా వచ్చి అతనికి తాకే అవకాశం ఉండేది. అయితే, ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.