Retired Out-Retired Hurt : రిటైర్డ్ ఔట్‌కు రిటైర్డ్ హ‌ర్ట్‌కు మ‌ధ్య చాలా తేడా ఉంది? ఏంటో తెలుసా?

రిటైర్డ్ ఔట్‌, రిటైర్డ్ హ‌ర్ట్ లు రెండూ ఒక‌టి కావు. వీటి మ‌ధ్య చాలా తేడా ఉంది.

Retired Out-Retired Hurt : రిటైర్డ్ ఔట్‌కు రిటైర్డ్ హ‌ర్ట్‌కు మ‌ధ్య చాలా తేడా ఉంది? ఏంటో తెలుసా?

Courtesy BCCI

Updated On : April 5, 2025 / 2:24 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ మ‌రో ఓట‌మిని చ‌విచూసింది. శుక్ర‌వారం ల‌క్నోలోని ఎకానా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 12 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఆట‌గాడు తిలక్ వ‌ర్మ రిటైర్డ్ ఔట్ కావ‌డం చాలా మందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ముంబై కోచ్ జ‌య‌వ‌ర్ధ‌నే తీసుకున్న ఈ నిర్ణ‌యంపై చాలా వ‌ర‌కు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఈ మ్యాచ్‌లో తిల‌క్ 23 బంతులను ఎదుర్కొని 25 ప‌రుగులు చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌ల్లో 2 ఫోర్లు మాత్ర‌మే ఉన్నాయి. ల‌క్ష్య ఛేద‌న‌లో అత‌డు నెమ్మ‌దిగా బ్యాటింగ్ చేస్తున్నాడ‌ని భావించిన జ‌య‌వ‌ర్ధ‌నే ముంబై విజ‌యానికి 7 బంతుల్లో 24 ప‌రుగులు అవ‌స‌రం అయిన స‌మ‌యంలో అత‌డిని రిటైర్డ్ క‌మ్మ‌ని చెప్పాడు.

LSG vs MI : గెలుపు జోష్‌లో ఉన్న ల‌క్నోకు డ‌బుల్ షాక్‌.. పంత్‌ను వెంటాడుతున్న దుర‌దృష్టం.!

దీంతో తిల‌క్ వ‌ర్మ రిటైర్డ్ ఔట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. అత‌డి స్థానంలో మిచెల్ సాంట్న‌ర్ వ‌చ్చాడు. ముంబై తీసుకున్న ఈ వ్యూహాత్మ‌క‌మైన నిర్ణ‌యం ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు.

ఈ మ్యాచ్‌లో ల‌క్నో మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ (60), ఐడెన్ మార్‌క్ర‌మ్ (53) అర్థ‌శ‌త‌కాలు చేశారు. ఆయుష్ బ‌దోని (30), డేవిడ్ మిల్ల‌ర్ (27) వేగంగా ఆడారు. ముంబై బౌల‌ర్ల‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐదు వికెట్లు తీయ‌గా.. బౌల్ట్‌, అశ్వ‌నికుమార్‌, విఘ్నేష్ పుతూరు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Suryakumar Yadav : తిలక్ వ‌ర్మ రిటైర్డ్ ఔట్ పై సూర్య‌కుమార్ యాద‌వ్‌ రియాక్ష‌న్ వైర‌ల్‌.. ముంబై కోచ్ జ‌య‌వ‌ర్ధ‌నే న‌చ్చ‌జెప్పినా కూడా..

అనంత‌రం.. సూర్య‌కుమార్ యాద‌వ్ (67), న‌మ‌న్‌ దీర్ (46; 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించిన‌ప్ప‌టికి ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబై జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 191 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ల‌క్నో బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్‌, ఆకాశ్ దీప్‌, అవేశ్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రతి త‌లా ఓ వికెట్ తీశారు.

రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హ‌ర్ట్ తేడా ఏంటి?

ఒక ప్లేయ‌ర్‌ని వ్యూహంలో భాగంగా జట్టు ఔట్ అని పిలిచినప్పుడు రిటైర్డ్ ఔట్ సంభవిస్తుంది. అయితే ఒక ఆటగాడు గాయం కారణంగా మైదానం వదిలి వెళితే.. రిటైర్డ్ హర్ట్ సంభవిస్తుంది.

* ఓ బ్యాట‌ర్ ఔట్ కానున్న కూడా..  స్వ‌యంగా లేదా కెప్టెన్ ఆదేశం మేర‌కు మైదానం వీడితే అత‌డిని రిటైర్డ్ ఔట్‌గా ప‌రిగ‌ణ‌నిస్తారు. ఈ స‌మ‌యంలో అంపైర్ ఔట్ ఇవ్వ‌డు కానీ.. బ్యాట‌ర్ మైదానం వీడుతాడు. ఆ మ్యాచ్‌లో మ‌రోసారి స‌ద‌రు ఆట‌గాడు మ‌ళ్లీ బ్యాటింగ్ చేయ‌లేడు.

LSG vs MI : తిల‌క్ వ‌ర్మ రిటైర్డ్ ఔట్ పై ముంబై కోచ్ జ‌య‌వ‌ర్ధ‌నే అలా.. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఇలా..

* గాయం లేదా అనారోగ్య కార‌ణంగా ఓ బ్యాట‌ర్ మైదానాన్ని వీడితే దాన్ని రిటైర్డ్ హ‌ర్ట్‌గా పిలుస్తారు. త‌న ప‌రిస్థితిని అంపైర్‌కు వివ‌రించి ఆట‌గాడు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్ల‌వ‌చ్చు. ఆ మ్యాచ్‌లో స‌ద‌రు ఆట‌గాడు మ‌రోసారి బ్యాటింగ్ చేయ‌వ‌చ్చు. అయితే.. మ‌ధ్య‌లో రాకూడ‌దు. వికెట్ ప‌డిన త‌రువాత లేదంటే మ‌రో ఆట‌గాడు రిటైర్డ్ అయిన‌ప్పుడు మాత్ర‌మే బ్యాటింగ్ చేయొచ్చు.