IPL 2025 : మారని చెన్నై తీరు.. వరుసగా మూడో ఓటమి

ఈ మ్యాచ్ లో 25 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.

IPL 2025 : మారని చెన్నై తీరు.. వరుసగా మూడో ఓటమి

Courtesy BCCI

Updated On : April 5, 2025 / 7:26 PM IST

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తీరు మారలేదు. పేలవ ప్రదర్శన కంటిన్యూ అవుతోంది. ఈ సీజన్ లో చెన్నై ముచ్చటగా మూడో ఓటమి చవిచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్ కే పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో 25 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. 184 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సీఎస్ కే.. 5 వికెట్ల నష్టానికి 158 పరుగులకే పరిమితమైంది. దీంతో 25 పరుగుల తేడాతో ఢిల్లీ చేతిలో ఓటమి చవిచూసింది. చెన్నై జట్టులో విజయ్ శంకర్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. శంకర్ 54 బంతుల్లో 69 పరుగులు చేశాడు. చివరలో ఎంఎస్ ధోని 26 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కానీ, ఓటమిని తప్పించలేకపోయాడు.

Also Read : ఫస్ట్ టైమ్.. మ్యాచ్ చూసేందుకు స్టేడియంకి వచ్చిన ధోని తల్లిదండ్రులు.. రిటైర్‌మెంట్‌పై మళ్లీ ఊహాగానాలు..!

ఈ సీజన్ లో చెన్నైకి ఇది హ్యాట్రిక్ పరాజయం కాగా.. ఢిల్లీకి హ్యాట్రిక్ విజయం. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలుపొందింది. తొలి మ్యాచ్ లో లక్నో పై, రెండో మ్యాచ్ లో హైదరాబాద్ పై విక్టరీ కొట్టింది. ఇక మూడో మ్యాచ్ లో చెన్నైని చిత్తు చేసింది. హ్యాట్రిక్ విజయాలతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ కు చేరింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఉన్నాయి.