Ms Dhoni : ఫస్ట్ టైమ్.. మ్యాచ్ చూసేందుకు స్టేడియంకి వచ్చిన ధోని తల్లిదండ్రులు.. రిటైర్‌మెంట్‌పై మళ్లీ ఊహాగానాలు..!
గత సీజన్‌లోనూ ఇదే తరహా ప్రచారం నడిచింది. అయితే, ఆ ఊహాగానాలకు తెరదించుతూ..

Courtesy @ChennaiIPL
Ms Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని రిటైర్ మెంట్ పై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎల్ కు ధోని గుడ్ బై చెబుతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఈ ఊహాగానాలు తెరమీదకు రావడానికి కారణం లేకపోలేదు. ఫస్ట్ టైమ్.. ధోని తల్లిదండ్రులు మ్యాచ్ చూసేందుకు స్టేడియంకి వచ్చారు. అంతే, ఒక్కసారిగా ధోని రిటైర్ మెంట్ గురించి చర్చ మొదలైంది. ఢిల్లీతో మ్యాచ్ తర్వాత రిటైర్ మెంట్ పై ధోని ప్రకటన చేస్తారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
శనివారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ లో అరుదైన దృశ్యం కనిపించింది. అదే ధోనీ పేరెంట్స్. ఎప్పుడూ పెద్దగా బయట కనిపించని ఎంఎస్ ధోనీ తల్లిదండ్రులు ఫస్ట్ టైమ్ స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మ్యాచ్ లో ధోనీ పేరెంట్స్ హైలైట్ గా నిలిచారు.
సాధారణంగా ధోనీ తల్లిదండ్రులు పాన్‌సింగ్, దేవకీదేవీ మ్యాచ్‌లు చూసేందుకు ఎప్పుడూ బయటకు వచ్చింది లేదు. అలాంటిది సడెన్ గా స్టేడియంలో కనిపించి ధోని అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. అంతే, ధోనీ రిటైర్‌మెంట్ గురించి మళ్లీ ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. ఢిల్లీతో మ్యాచ్ ముగిశాక రిటైర్ మెంట్ పై ధోని ఏమైనా ప్రకటన చేస్తాడా? అని అటు ధోని అభిమానులు, ఇటు క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ధోని తల్లిదండ్రులు స్టేడియంకి వచ్చి మ్యాచ్ ను చూడటం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక, గత సీజన్‌లోనూ ఇదే తరహా ప్రచారం నడిచింది. అయితే, ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ధోనీ 18వ సీజన్‌లోనూ ఆడుతున్నాడు. ఇదే సమయంలో ఎన్నడూ లేని విధంగా ధోనీ పేరెంట్స్ కనిపించడం ఫ్యాన్స్ లో మరోసారి రిటైర్ మెంట్ అంశంపై చర్చకు దారితీసింది.
Also Read : రిటైర్డ్ ఔట్‌కు రిటైర్డ్ హర్ట్‌కు మధ్య చాలా తేడా ఉంది? ఏంటో తెలుసా?
కాగా, రిటైర్ మెంట్ అంశంపై ఇటీవలే ధోని స్పందించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తన ఫ్రాంచైజీ అని, సీఎస్ కే తరపున మరింత కాలం ఆడాలని అనుకుంటున్నట్లు తన మనసులో మాట చెప్పాడు. ఒక వేళ తాను వీల్‌ఛైర్‌లో ఉన్నా తనను లాక్కెళ్లిపోతారని సరదాగా చెప్పుకొచ్చాడు.
ధోని చివరిసారిగా 2023లో సీఎస్ కే కెప్టెన్ గా ఉన్నాడు. ఆ సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టుని విజేతగా నిలిపాడు. ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపి.. ఎక్కువసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై సరసన చెన్నై సూపర్ కింగ్స్ ని నిలిపాడు ధోనీ.
Home sweet Anbuden ft. The Dhonis! 🏠🏟️#CSKvDC #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/Bj1rnt1nCw
— Chennai Super Kings (@ChennaiIPL) April 5, 2025