కోహ్లీ.. సచిన్.. ధోనీ చదివిందేంటో తెలుసా.. డిగ్రీ కూడా పాసవ్వని వాళ్లెవరంటే

  • Published By: veegamteam ,Published On : February 23, 2020 / 12:11 PM IST
కోహ్లీ.. సచిన్.. ధోనీ చదివిందేంటో తెలుసా.. డిగ్రీ కూడా పాసవ్వని వాళ్లెవరంటే

Updated On : February 23, 2020 / 12:11 PM IST

విరాట్ కోహ్లీ: 
టీం ఇండియన్ కెప్టైన్ విరాట్.. ఢిల్లీలోని విషాల్ బార్తీ పబ్లిక్ స్కూల్ లో 12వ తరగతి వరకు చదువుకున్నాడు. అతను నవంబర్ 5, 1988లో జన్మించారు. 

H

సచిన్  టెండూల్కర్:
ప్రపంచ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ఒక లెజెండ్. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. ఈయన ముంబైలోని శర్దస్రం విద్యా మందిర్ స్కూల్ లో 12వ తరగతి చదువుకున్నారు. 

Educational qualifications of 20 Indian cricketers

 

ఉమేష్ యాదవ్:
ఉమేష్ బౌలింగ్ లో స్పెషలిస్ట్ అని మనందరికి తెలుసు. ఈయన మహారాష్ట్రలోని ఖాపర్ఖేడలోని శంకర్ రావు చౌహాన్ విద్యాలయలో 12వ తరగతి చదువుకున్నారు. 

V

ఎం.ఎస్ ధోనీ:
ఈయన పూర్తి పేరు మహేంద్ర సింగ్ ధోనీ,  1981 జూలై 7న రాంచిలో జన్మించారు. ధోనీ తన 10వ తరగతి తర్వాత క్రికెట్ పై దృష్టి పెట్టాడు. ముంబైలోని St. Xavier’s College లో గ్రాడ్యుయేషన్ డ్రాపౌట్ చేశారు.   

B

సౌరవ్ గంగూలీ:
‘దాదా’ గా ప్రసిద్ది చెందిన భారత జట్టు మాజీ కెప్టెన్  సౌరవ్ గంగూలీ 1972 జూలై 8న జన్మించారు. ఈయన కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత, పీహెచ్. డీ లో అవార్డు సాధించాడు. 

N

రోహిత్ శర్మ:
భారత జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ త‌న కెరీర్‌లో 24 టెస్టులు, 18 వ‌న్డేలు, 6 టీ20లు ఆడాడు. తను 12వ తరగతి వరకు చదువుకున్నాడు. 

K

రవిచంద్రన్ అశ్విన్:
రవిచంద్రన్ అశ్విన్ ఒక భారతదేశ అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు తను 17 సెప్టెంబర్ 1986 లో జన్మించాడు. ఇతను చెన్నైలోని ఎస్‌ఎస్‌ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ చేశాడు.  

L

రాహుల్ ద్రవిడ్: 
ది వాల్ గా పిలువబడే మాజీ భారత క్రికెటర్ బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఈయన 1973 జనవరి 11 న మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో జన్మించారు.

O

అజింక్య రహానె:
మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మాన్ ముంబై విశ్వవిద్యాలయం బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. 

J

అనిల్ కుంబ్లే:
భారతదేశపు ప్రముఖ క్రికెట్ బౌలర్ అనిల్ కుంబ్లే  1970 అక్టోబర్ 17 న కర్ణాటక లోని బెంగుళూరులో జన్మించారు.  అనిల్ కుంబ్లే పూర్తి పేరు అనిల్ రాధాకృష్ణన్ కుంబ్లే. ఈయన బెంగళూరులోని ఆర్‌వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు.

C

శిఖర్ ధావన్:
శిఖర్ 1985 డిసెంబర్ 5న జన్మించారు. ఢిల్లీ పాఠశాలలో 12 వ తరగతి వరకు చదువుకున్నారు.

C

వీరేందర్ సెహ్వాగ్: 
భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు వీరేంద్ర సెహ్వాగ్ అక్టోబర్ 20, 1978న జన్మించారు. ఈయన ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

U

హార్దిక్ పాండ్యా:
బరోడా క్రికెట్ టీంకు చెందిన భారత ఆటగాడు హార్దిక్ 1993 అక్టోబరు 11న జన్మించారు. ఈయన వడోదరలోని ఎంకే హై స్కూల్ లో 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత క్రికెట్‌పై దృష్టి పెట్టడానికి చదువు నుంచి దూరమయ్యాడు. 

X

కె.ఎల్ రాహుల్:
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు కె.ఎల్.రాహుల్ ఏప్రిల్ 18, 1992న జన్మించాడు. ఈయన బెంగళూరులోని జైన్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశాడు.

A

వివిఎస్ లక్ష్మణ్: 
అతని పూర్తి పేరు.. వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్. నవంబర్ 1, 1974లో హైదరాబాదులో జన్మించాడు. భారతదేశంలో బాగా చదువుకున్న క్రికెటర్లలో ఒకరైన లక్ష్మన్ MBBS పూర్తి చేశాడు. 

S

మనీష్ పాండే:
టీమిండియా క్రికెటర్ మనీష్‌ పాండే బెంగళూరులోని జైన్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. 

AS

జవగల్ శ్రీనాథ్:
జవగల్ మాజీ భారత క్రికెట్ క్రీడాకారుడు. 1969 ఆగస్టు 31న కర్ణాటకలోని మైసూరులో జన్మించాడు. మైసూర్ లోని శ్రీ జయచమరాజేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసాడు.

S

రిషబ్ పంత్:
2018 లో వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్. ఈయన ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. 

D

యువరాజ్ సింగ్:
యువరాజ్ సింగ్ భారత మాజీ బౌలర్ మరియు పంజాబీ సినీ నటుడు. ఈయన 1981, డిసెంబర్ 12న చండీగర్ లో జన్మించారు. ఢిల్లీలోని డిఎవి పాఠశాలలో 12వ తరగతి వరకు చదువుకున్నాడు.

ZX

గౌతమ్ గంభీర్:
ఢిల్లీలోని హిందూ కాలేజీలో గ్రాడ్యుయేట్ చదువుకున్నాడు. ఈయన మాజీ క్రికెటర్, బిజెపి రాజకీయ నాయకుడు. 1981 అక్టోబర్ 14 న ఢిల్లీ లోజన్మించాడు.

A