ENG vs IND 2nd test Shubman Gill Blunder To Cost BCCI rs 250 Crores
టీమ్ఇండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ టెస్టుల్లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. విదేశాల్లో పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. కాగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్‌గా గిల్ రికార్డులకు ఎక్కాడు.
ఇక ఈ మ్యాచ్‌లో గిల్ కెప్టెన్‌గానే కాకుండా ఓ బ్యాటర్‌గా అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ద్విశతకం (269) బాదిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో (161) భారీ శతకాన్ని సాధించాడు.
ENG vs IND : చరిత్ర సృష్టించిన ఆకాశ్ దీప్.. 8వ టెస్టులోనే 39 ఏళ్ల రికార్డును బ్రేక్..
గిల్ చేసిన తప్పిదం..?
ఇక ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఓ తప్పిదం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత ఇన్నింగ్స్ డిక్లేర్ సందర్భంగా అతడు చేసిన తప్పు కారణంగా బీసీసీఐ భారీగా నష్టపోయే అవకాశం ఉంది.
భారత రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సమయంలో గిల్ బ్లాక్ కలర్ టీషర్టులో ఉన్నాడు. టీషర్టు వేసుకోవడం తప్పుకాదు కానీ దానిపై ఉన్న సింబల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది నైక్ బ్రాండ్‌కు చెందిన టీషర్టు. ప్రస్తుతం టీమ్ఇండియా అఫీషియల్ కిట్ పార్టనర్‌గా అడిడాస్ ఉంది. దీంతో ఆటగాళ్లు మ్యాచ్ సమయంలో అడిడాస్ సంస్థ లోగో ఉన్న వాటినే వాడాల్సి ఉంటుంది.
— Shubman Gill (@ShubmanGill) July 6, 2025
అయితే.. కెప్టెన్ గిల్ మాత్రం నైక్‌కు చెందిన టీషర్టుతో కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
బీసీసీఐకి భారీ నష్టం..
భారత పురుషుల జట్టు జెర్సీలు, కిట్లు రూపొందించేందుకు 2023లో బీసీసీఐతో అడిడాస్ భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు అమలులో ఉండనుంది. ఇప్పుడు గిల్ అడిడాస్ కాకుండా తన కాంపిటేటర్ అయిన మరో బ్రాండ్ ధరించి కనిపించడంతో ఇప్పుడు అడిడాస్.. బీసీసీఐతో ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కును కలిగి ఉంది. అంతేకాకుండా ఆటగాడు నిబంధనలు, షరతులు ఉల్లంఘించడంతో పరిహారం కూడా కోరే ఛాన్స్ ఉంది.
ENG vs IND : కెప్టెన్‌గా తొలి టెస్టు విజయం.. పిచ్ పై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర కామెంట్స్..
ఒకవేళ అడిడాస్ గనుక బీసీసీఐతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే.. అప్పుడు బీసీసీఐకి రూ.250 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐతో ఒప్పందాన్ని కలిగి ఉండడం అడిడాస్‌కు కూడా ఎంతో ప్రయోజనం. ఈ క్రమంలో ఆ కంపెని ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోవచ్చు. అదే సమయంలో బోర్డుకు, ఆటగాడికి హెచ్చరికలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.