ENG vs IND : మాంచెస్ట‌ర్‌లో టీమ్ఇండియా రికార్డు చూస్తే మైండ్ బ్లాక్‌..

దాదాపు 11 ఏళ్ల త‌రువాత మాంచెస్ట‌ర్‌లో భార‌త జ‌ట్టు టెస్టు మ్యాచ్ ఆడ‌బోతుంది.

ENG vs IND 4th test Do you know Team India record in Manchester

అండ‌ర్స‌న్‌-టెండూల్క‌ర్ ట్రోఫీలో భాగంగా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డుతున్నాయి. ఇరు జ‌ట్లు నువ్వా నేనా అన్న‌ట్లుగా ఆడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెల‌వ‌గా రెండో మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం సాధించింది. ఇక మూడో మ్యాచ్‌లో మ‌ళ్లీ ఇంగ్లాండ్ గెలిచింది.

ప్ర‌స్తుతానికి భార‌త్ ఈ సిరీస్‌లో 1-2 తేడాతో వెనుక‌బ‌డి ఉంది. ఈ క్ర‌మంలో జూలై 23 నుంచి మాంచెస్ట‌ర్ వేదిక‌గా ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో గెలిచి సిరీస్‌ను 2-2తో స‌మం చేయాల‌ని టీమ్ఇండియా ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఈ క్ర‌మంలో నెట్స్‌లో భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు.

ENG vs IND : ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు.. భార‌త్‌కు త‌ల‌నొప్పిగా మారిన తుది జ‌ట్టు కూర్పు..!

మాంచెస్ట‌ర్‌లో భార‌త రికార్డు ఇదే..

దాదాపు 11 ఏళ్ల త‌రువాత మాంచెస్ట‌ర్‌లో భార‌త జ‌ట్టు టెస్టు మ్యాచ్ ఆడ‌బోతుంది. అయితే.. ఈ మైదానంలో టీమ్ఇండియా ట్రాక్ రికార్డు ప్ర‌స్తుతం భార‌త అభిమానుల‌ను ఆందోళ‌నకు గురి చేస్తోంది. ఈ మైదానంలో భార‌త్ ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌యం సాధించ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ఇండియా ఇక్క‌డ 9 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోగా, మ‌రో 5 మ్యాచ్‌ల‌ను డ్రా చేసుకుంది.

ఈ మైదానంలో భార‌త జ‌ట్టు అత్య‌ధిక స్కోరు 432 ప‌రుగులు కాగా.. అత్య‌ల్ప స్కోరు 58. 1990లో మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ చేసిన 179 ప‌రుగులే ఈ మైదానంలో టీమ్ఇండియా ఆట‌గాడి అత్య‌ధిక స్కోరు. ఇక బౌలింగ్‌లో దిలీష్ జోషి ఓ ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీశాడు.

ఇంగ్లాండ్ రికార్డు అదుర్స్‌..
మాంచెస్ట‌ర్ మైదానంలో ఇంగ్లాండ్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఈ మైదానంలో భార‌త్ ఇప్ప‌టి వ‌ర‌కు 81 టెస్టులు ఆడింది. ఇందులో 33 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. 15 మ్యాచ్‌ల్లో ఓడ‌గా.. మ‌రో 36 మ్యాచ్‌ల‌ను డ్రా చేసుకుంది. ఇక 2019 నుంచి ఇక్క‌డ ఆడిన మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు.

BCCI : 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా? ఐపీఎల్ ద్వారానే 5 వేల కోట్ల పై చిలుకు ..

ఈ సిరీస్‌లో టీమ్ఇండియా అంచ‌నాల‌ను మించి రాణిస్తోంది. రెండో టెస్టుకు వేదికైన ఎడ్జ్‌బాస్ట‌న్‌లో చ‌రిత్ర తిర‌గ‌రాసిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ తొలి విజ‌యాన్ని న‌మోదు చేసింది. అలాగే.. మాంచెస్ట‌ర్‌లో కూడా భార‌త్ అద్భుతం చేయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.