సిరాజ్ సక్సెస్ సీక్రెట్.. పొద్దున్నే లేచి గూగుల్ నుంచి ఆ ఎమోజీ తీశాడట.. ఆ తర్వాత రచ్చ రచ్చే..

"ఆ తర్వాత మనం వెనుకపడిపోయాం. కానీ దేవుడికి థ్యాంక్స్. అప్పుడే మ్యాచ్ పోయిందనుకున్నాను" అని సిరాజ్ అన్నాడు.

సిరాజ్ సక్సెస్ సీక్రెట్.. పొద్దున్నే లేచి గూగుల్ నుంచి ఆ ఎమోజీ తీశాడట.. ఆ తర్వాత రచ్చ రచ్చే..

Pic- @ICC

Updated On : August 4, 2025 / 10:03 PM IST

“ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే నా ఫోన్‌లో గూగుల్ ఓపెన్ చేశాను. అందులో ‘బిలీవ్’ ఎమోజీ వాల్‌పేపర్ చూశాను.. దేశం కోసం ఇది నేనే చేస్తాను అని నాకు నానే చెప్పుకున్నాను” అని అన్నాడు టీమిండియా బౌలర్ సిరాజ్.

ఓవల్‌లో జరిగిన ఐదో టెస్ట్‌ మ్యాచులో ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో సిరాజ్‌దే కీలక పాత్ర. ఓవల్‌ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ 30.1 ఓవర్లలో 104 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి టీమిండియాను గెలిపించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ పలు వివరాలు తెలిపాడు.

Also Read: టెస్ట్‌ క్రికెట్ చరిత్రలో అత్యల్ప పరుగులతో విజయం.. గతంలో ఒక్క పరుగుతో గెలిచిన 2 జట్లు ఉన్నాయ్‌.. ఫుల్ డీటెయిల్స్‌

“ఏ సమయంలోనైనా నేను మ్యాచ్‌ను గెలిపించగలనని ఎప్పుడూ నమ్ముతాను, ఉదయం అదే చేశాను. నా ఏకైక ప్లాన్ మంచి లెంగ్త్‌లో బాల్స్‌ వేయడమే… ఇక వికెట్లు తీసినా, పరుగులు ఇచ్చినా నాకే సంబంధం లేదు” అని జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన పోస్ట్ మ్యాచ్ చాట్‌లో దినేశ్‌ కార్తీక్‌కు సిరాజ్ చెప్పాడు.

హ్యారీ బ్రూక్ 19 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారీ షాట్‌ కొట్టగా బౌండరీ వద్ద క్యాచ్ పట్టే ప్రయత్నంలో సిరాజ్ బౌండరీ కషన్‌ దాటాడు. దీంతో బ్రూక్ ఆ తర్వాత అద్భుత శతకం చేశాడు. అప్పుడు మ్యాచ్ భారత్ చేతుల నుంచి జారుతున్నట్టే కనిపించింది.

దీనిపై సిరాజ్ స్పందిస్తూ.. “ఆ క్యాచ్ పట్టే సమయంలో కషన్ తాకుతానని నాకే తెలియదు. అదే మ్యాచ్ మలుపు. బ్రూక్ టీ20 మూడ్‌లోకి వెళ్లిపోయాడు. తర్వాత మనం వెనుక పడిపోయాం. కానీ దేవుడికి థ్యాంక్స్. అప్పుడే మ్యాచ్ పోయిందనుకున్నాను” అని సిరాజ్ అన్నాడు.