ENG vs IND Rahul misses Gavaskar legendary record by 10 runs
లండన్‌లోని కెన్నింగ్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కేఎల్ రాహుల్ విఫలం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేసిన రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో 7 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో తృటిలో ఓ భారీ రికార్డును కోల్పోయాడు.
ఐదో టెస్టు మ్యాచ్‌లో విఫలం అయినప్పటికి ఇంగ్లాండ్ పర్యటనలో కేఎల్ రాహుల్ ఉత్తమ ప్రదర్శననే చేశాడు. ఈ సిరీస్‌లో రాహుల్ 532 పరుగులు సాధించాడు. అయితే.. ఓ చారిత్రాత్మక మైలురాయిని చేరుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.
PCB : డబ్ల్యూసీఎల్ ఎఫెక్ట్.. పీసీబీ సంచలన నిర్ణయం.. అక్కడ పాకిస్థాన్ పేరు బ్యాన్..
ఇంగ్లాండ్ గడ్డ పై ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా నిలిచే రికార్డును కేవలం 10 పరుగుల తేడాతో కోల్పోయాడు. ఇప్పటికి కూడా ఈ రికార్డు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ పేరిటే ఉంది. 1979 సిరీస్‌లో గవాస్కర్ 542 పరుగులు సాధించాడు.
ఇంగ్లాండ్‌లో ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్లు..
సునీల్ గవాస్కర్ – 542 పరుగులు (1979లో)
కేఎల్ రాహుల్ – 532 పరుగులు (2025లో)
మురళీ విజయ్ – 402 పరుగులు (2014లో)
రోహిత్ శర్మ – 368 పరుగులు (2021-22లో)
ఐదో టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే.. మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 224 పరుగలు చేసింది. ఆ తరువాత ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌కు 23 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. క్రీజులో యశస్విజైస్వాల్ (51), ఆకాశ దీప్ (4) లు ఉన్నారు.