ENG vs IND : గంభీర్ మాస్ట‌ర్ ప్లాన్‌.. 14 రోజుల ముందుగానే ఇంగ్లాండ్‌కు భార‌త జ‌ట్టు.. విమాన‌మెక్కిన టీమ్ఇండియా ఆట‌గాళ్లు..

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు ఇంగ్లాండ్‌కు బ‌య‌లుదేరారు.

ENG vs IND Team India departs for England ahead of Test series

ఇంగ్లాండ్ జ‌ట్టుతో టీమ్ఇండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడ‌నుంది. ఈ సిరీస్ కోసం భార‌త జ‌ట్టు శుక్ర‌వారం ఇంగ్లాండ్ కు ప‌య‌న‌మైంది. కోచ్ గౌత‌మ్ గంభీర్‌, కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌, ర‌వీంద్ర జ‌డేజా, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, రిష‌బ్ పంత్, జ‌స్‌ప్రీత్ బుమ్రాల‌తో పాటు ఇంకొంద‌రు ఆట‌గాళ్లు ముంబై విమానాశ్ర‌యం నుంచి ఇంగ్లాండ్ విమానం ఎక్కారు.

ఈ విష‌యాన్ని బీసీసీఐ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ENG vs IND : గౌత‌మ్ గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. బుమ్రాను అన్ని మ్యాచ్‌లు ఆడించం.. అత‌డు ఆడ‌క‌పోయినా ఏం కాదు..

సీనియ‌ర్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పిన త‌రువాత భార‌త జ‌ట్టు ఆడ‌నున్న మొద‌టి టెస్టు సిరీస్ ఇదే. శుభ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలో భార‌త్ బ‌రిలోకి దిగ‌నుంది. ఇంగ్లాండ్ ప‌రిస్థితుల‌కు అల‌వాటు ప‌డేందుకు 14 రోజుల ముందుగానే భార‌త్ అక్క‌డి వెలుతోంది.

జూన్ 20 నుంచి హెడ్డింగ్లీ వేదిక‌గా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తోనే ఇరు జ‌ట్ల ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ 2025-27) కొత్త సైకిల్ ప్రారంభం కానుంది.

Bengaluru Stampede : బెంగ‌ళూరు తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. ఆర్‌సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్‌..

కాగా.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు జూన్ 13 నుంచి 16 వ‌ర‌కు బెకెన్‌హామ్ వేదిక‌గా ఇండియా-ఏతో సీనియ‌ర్ భార‌త జ‌ట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడ‌నుంది.

భార‌త్‌, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి టెస్టు – జూన్ 20 నుంచి 24 వ‌ర‌కు – హెడింగ్లీ
* రెండో టెస్టు – జూలై 2 నుంచి 6 వ‌ర‌కు – ఎడ్జ్‌బాస్టన్
* మూడో టెస్టు – జూలై 10 నుంచి 14 వ‌ర‌కు – లార్డ్స్
* నాలుగో టెస్టు – జూలై 23 నుంచి 27 వ‌ర‌కు – ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్
* ఐదో టెస్టు – జూలై 31 నుంచి ఆగ‌స్టు 4 వ‌ర‌కు – కియా ఓవల్