ENG vs IND : గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు.. బుమ్రాను అన్ని మ్యాచ్‌లు ఆడించం.. అతడు ఆడకపోయినా ఏం కాదు..
ఇంగ్లాండ్ బయలుదేరే ముందు టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

Its always difficult to replace someone like Bumrah but Gautam Gambhir
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లాండ్ బయలుదేరే ముందు టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ పర్యటనలో 5 టెస్టులు మ్యాచ్‌లు ఆడడని, కొన్ని మ్యాచ్‌ల్లోనే ఆడతాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జట్టును ఎంపిక చేసే సమయంలోనే వెల్లడించాడు. ఈ విషయంపై గంభీర్ మాట్లాడుతూ.. బుమ్రా గైర్హాజరీలోనూ రాణించే పేస్ విభాగం భారత జట్టు సొంతం అని చెప్పాడు. బుమ్రాను ఏ మూడు మ్యాచ్‌ల్లో ఆడించాలనే దానిపై తాము ఇంకా ఓ నిర్ణయానికి రాలేదన్నాడు.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రాను అన్ని మ్యాచ్‌లు ఆడించలేమన్నాడు. అతడిని ఎన్ని మ్యాచ్‌లు ఆడించాలనే విషయంపైనా నిర్ణయం తీసుకోలేదన్నాడు. అతడి స్థానాన్ని భర్తీ చేయడం కష్టమైనప్పటికి.. తమ బౌలింగ్ దళంలో క్వాలిటీ బౌలర్లు ఉన్నారని చెప్పుకొచ్చాడు.
‘బుమ్రా ఆడకపోతే అతడి స్థానంలో మరొకరికి అవకాశం దక్కుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో సమయంలోనూ ఇదే జరిగింది. ఇంగ్లాండ్‌లో పరిస్థితులు, మ్యాచ్ ఫలితాలను బట్టి అతడికి ఏ మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వాలనేది నిర్ణయం తీసుకుంటాం. జట్టు విజయాలు సాధిస్తున్నా కూడా నేను ఒత్తిడిలోనే ఉంటా. ఎందుకంటే కోచ్‌గా ఎల్లప్పుడూ మంచి ఫలితాలు రావాలని కోరుకుంటా. అని గంభీర్ అన్నాడు.
Virat Kohli : ఐపీఎల్ అయిపోయింది.. మళ్లీ కోహ్లీ మైదానంలో కనపడేది అప్పుడేనా..! ఇదేం ట్విస్ట్..
భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టెస్టు – జూన్ 20 నుంచి 24 వరకు – హెడింగ్లీ
* రెండో టెస్టు – జూలై 2 నుంచి 6 వరకు – ఎడ్జ్‌బాస్టన్
* మూడో టెస్టు – జూలై 10 నుంచి 14 వరకు – లార్డ్స్
* నాలుగో టెస్టు – జూలై 23 నుంచి 27 వరకు – ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్
* ఐదో టెస్టు – జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు – కియా ఓవల్