Virat Kohli : ఐపీఎల్ అయిపోయింది.. మళ్లీ కోహ్లీ మైదానంలో కనపడేది అప్పుడేనా..! ఇదేం ట్విస్ట్..
ఇప్పుడు అందరి దృష్టి కోహ్లీని మళ్లీ మైదానంలో ఎప్పుడు చూస్తామా? అన్న దానిపై పడింది.

Do you know When Will Next Virat Kohli Play For India
ఐపీఎల్ 2025 సీజన్ ముగిసింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ కప్పును ముద్దాడింది. ఈ క్రమంలో ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాలన్న కోహ్లీ కల కూడా నెరవేరింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి కోహ్లీని మళ్లీ మైదానంలో ఎప్పుడు చూస్తామా? అన్న దానిపై పడింది.
ఎందుకంటే విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో టీ20, టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. టీమ్ఇండియా జూన్ నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో కోహ్లీ ఈ సిరీస్ ఆడడు.
LSG : లక్నో జట్టులో మార్పులు తప్పవు..! తొలి వేటు అతడిపైనే..? పాపం ఒక్క ఏడాదికే..
కోహ్లీ మళ్లీ మైదానంలోకి దిగేది ఆగస్టులోనే. ఆగస్టులో భారత జట్టు బంగ్లాదేశ్‌తో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ఢాకా వేదికగా ఆగస్టు 17న తొలి వన్డే, రెండో వన్డే ఆగస్టు 20న, మూడో వన్డే ఆగస్టు 23న జరనున్నాయి.
కానీ.. ఆ దేశంలో అశాంతి కారణంగా భారత జట్టు అక్కడ పర్యటించకపోవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ బంగ్లాదేశ్‌తో సిరీస్ రద్దు అయితే మాత్రం కోహ్లీని చూసేందుకు అక్టోబర్ వరకు ఆగాల్సిందే.
భారత జట్టు అక్టోబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. తొలి వన్డే పెర్త్ వేదికగా అక్టోబర్ 19న, అడిలైడ్ వేదికగా అక్టోబర్ 23న రెండో వన్డే, సిడ్నీ వేదికగా అక్టోబర్ 25న మూడో వన్డే జరగనుంది.