ENG vs IND : భారత్‌తో సిరీస్.. తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. డేంజరస్ ఆల్‌రౌండర్ వచ్చేశాడు..
భారత్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్ కోసం ఇంగ్లాండ్ గురువారం (జూన్ 5న) 14 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది.

England Men name squad for 1st Rothesay Test Match against India
భారత్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్ కోసం ఇంగ్లాండ్ గురువారం (జూన్ 5న) 14 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. గాయం కారణంగా కొంత కాలం ఆటకు దూరం అయిన సీనియర్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ తిరిగి జట్టులోకి వచ్చాడు. జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్స్, జామీ ఓవర్టన్‌లను కూడా టెస్ట్ జట్టులోకి వచ్చారు.
గాయం కారణంగా పేసర్ గస్ అట్కిన్సన్ తొలి టెస్టుకు దూరం అయ్యాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్ జూన్ 20న ప్రారంభం కానుంది. మొదటి టెస్టుకు హెడింగ్లీ ఆతిథ్యం ఇవ్వనుంది.
Novak Djokovic : చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒకే ఒక్కడు..
ఇరు జట్లు ఈ సిరీస్‌తోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ 2025-27) నాలుగో సైకిల్‌ను ప్రారంభించనున్నాయి.
A simply HUGE series awaits 🙌
Our squad for the 1st Test is HERE 👇
🏴 #ENGvIND 🇮🇳
— England Cricket (@englandcricket) June 5, 2025
తొలి టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు ఇదే:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్.
భారత జట్టు ఐదు మ్యాచ్‌ల కోసం ఇప్పటికే జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగనుంది.
Virat Kohli : ఐపీఎల్ అయిపోయింది.. మళ్లీ కోహ్లీ మైదానంలో కనపడేది అప్పుడేనా..! ఇదేం ట్విస్ట్..
టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్ &వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టెస్టు – జూన్ 20 నుంచి 24 వరకు – హెడింగ్లీ
* రెండో టెస్టు – జూలై 2 నుంచి 6 వరకు – ఎడ్జ్‌బాస్టన్
* మూడో టెస్టు – జూలై 10 నుంచి 14 వరకు – లార్డ్స్
* నాలుగో టెస్టు – జూలై 23 నుంచి 27 వరకు – ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్
* ఐదో టెస్టు – జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు – కియా ఓవల్