Novak Djokovic : చ‌రిత్ర సృష్టించిన జ‌కోవిచ్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒకే ఒక్క‌డు..

టెన్నిస్ స్టార్ నొవాక్ జ‌కోవిచ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Novak Djokovic : చ‌రిత్ర సృష్టించిన జ‌కోవిచ్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒకే ఒక్క‌డు..

Novak Djokovic becomes oldest man to reach French Open Semifinal

Updated On : June 5, 2025 / 2:17 PM IST

టెన్నిస్ స్టార్ నొవాక్ జ‌కోవిచ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైన‌ల్ చేరిన అతి పెద్ద వ‌య‌స్కుడిగా చ‌రిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ 2025 టోర్నీలో బుధ‌వారం జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ప్ర‌పంచ మూడో ర్యాంక‌ర్ అలెగ్జాండ‌ర్ జ్వెరెవ్ ను ఓడించ‌డం ద్వారా జ‌కోవిచ్ ఈ ఘ‌న‌త సాధించాడు. గ‌తంలో ఈ రికార్డు రోలాండ్ గారోస్ (38 ఏళ్ల‌) పేరిట ఉండేది. 1968 అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు.

క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్‌లో 38 ఏళ్ల జ‌కోవిచ్ 4-6, 6-3, 6-2, 6-4 తేడాతో జ్వెరెవ్‌ను ఓడించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో జ‌కోవిచ్‌కు ఇది 100వ విజ‌యం కావ‌డం విశేషం. దిగ్గ‌జ ప్లేయ‌ర్ ర‌ఫెల్ నాద‌ల్ త‌రువాత ఈ ఘ‌న‌త సాధించిన రెండో ఆట‌గాడిగా జ‌కో నిలిచాడు. ఇక ఓవ‌రాల్‌గా జ‌కోకు ఇది 51వ గ్రాండ్ స్లామ్ సెమీఫైన‌ల్ కావ‌డం గ‌మ‌నార్హం.

Virat Kohli : ఐపీఎల్ అయిపోయింది.. మ‌ళ్లీ కోహ్లీ మైదానంలో క‌న‌ప‌డేది అప్పుడేనా..! ఇదేం ట్విస్ట్‌..

మూడు గంట‌ల 17 నిమిషాల పాటు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఆరంభంలో జ‌కోవిచ్ కాస్త ఇబ్బంది ప‌డ్డాడు. ఈ క్ర‌మంలో తొలి సెట్‌ను 6-4తో జ్వెరెవ్‌కు కోల్పోయాడు. అయితే.. ఆ త‌రువాత బ‌లంగా పుంచుకున్నాడు. డ్రాప్ షాట్లు, బ‌ల‌మైన డిఫెన్స్‌తో ప్ర‌త్య‌ర్థిని ఇబ్బంది పెట్టాడు. త‌న అనుభ‌వాన్ని ఉప‌యోగించి మ్యాచ్ పై ప‌ట్టు సాధించాడు. వ‌రుస‌గా మూడు సెట్ల‌లో విజ‌యం సాధించి మ్యాచ్‌లో గెలుపొందాడు.

Ryan Rickelton : ఐపీఎల్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్న ముంబై ఓపెన‌ర్‌.. ఆస్ట్రేలియాకు ద‌బిడి దిబిడే..

6 ఏస్‌ల‌తో పాటు 42 విన్న‌ర్ల‌ను జ‌కో విచ్ కొట్టాడు. 29 త‌ప్పిదాలు చేవాడు. 35 డ్రాప్ షాట్స్ ఆడి 121 పాయింట్లు సొంతం చేసుకున్నాడు. జ్వెరెవ్ విష‌యానికి వ‌స్తే.. 4 ఏస్‌లు, 38 విన్న‌ర్ల‌ను కొట్టాడు. 44 అన‌వ‌స‌ర త‌ప్పిదాల‌ను చేశాడు. 12 డ్రాప్ షాట్లు ఆడి 101 పాయింట్లు సాధించాడు.